- Telugu News Photo Gallery Cricket photos IPL 2022 Auction: 5 key Players that Royal Challengers Bangalore buy in mega auction including David Warner
IPL 2022 Auction: ఐదుగురు కీలక ఆటగాళ్లపై కన్నేసిన ఆర్‌సీబీ.. కోహ్లీ ప్లాన్ మాములు లేదుగా..!
Royal Challengers Bangalore: జట్టుకు సమతూకం అందించి ఈ సారి ఎలాగైన కప్ కొట్టేందుకు కీలక ఆటగాళ్లను ఎంచుకునే పనిలో ఆర్‌సీబీ దృష్టి సారించింది. విరాట్ కోహ్లి నుంచి ఏబీ డివిలియర్స్ వరకు వారసుల ఎంపిక చేసేందుకు సిద్ధమైంది.
Updated on: Dec 02, 2021 | 3:14 PM

Royal Challengers Bangalore: IPL 2022 కోసం రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. అన్ని జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ప్రస్తుతం మిగిలిన వారు వేలంలోకి వస్తారు. వారి పేర్లు వేలంలో ఉండడంతోపాటు ఈసారి వారికోసం 10 జట్లు పోటీపడనున్నాయి. ఆర్‌సీబీ కూడా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మిగిలిన జట్టు ఫామ్ కోసం వేలంలో నిలవనున్నారు. జట్టుకు సమతూకం అందించి ఈ సారి ఎలాగైన కప్ కొట్టేందుకు కీలక ఆటగాళ్లను ఎంచుకునే పనిలో ఆర్‌సీబీ దృష్టి సారించింది. విరాట్ కోహ్లి నుంచి ఏబీ డివిలియర్స్ వరకు వారసుల ఎంపిక చేసేందుకు సిద్ధమైంది. RCB కొనుగోలు చేయగల ఆటగాళ్లను ఓ సారిచూద్దాం.

డేవిడ్ వార్నర్: ఐపీఎల్ 2022 వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌పై ప్రతీ జట్టు కన్ను వేస్తుందనండలో సందేహం లేదు. డేవిడ్ వార్నర్‌పై ఆర్‌సీబీ కూడా ఆశలు పెట్టుకుంది. వార్నర్‌ని జోడించడం ద్వారా కెప్టెన్సీతో పాటు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చని ఆలోచిస్తుంది. అంటే, వార్నర్‌ను కొనుగోలు చేయడం వల్ల ఈ రెండు ప్రయోజనాలు ఆర్‌సీబీకి దొరకనున్నాయి.

షిమ్రాన్ హెట్మెయర్: RCB గ్లెన్ మాక్స్‌వెల్‌ను అట్టిపెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో షిమ్రాన్ కూడా హెట్మెయర్‌ను వేలంలో కొనుగోలు చేస్తే.. అది వారి బ్యాటింగ్‌కు బలం చేకూరుస్తుంది. RCBకి మిడిల్ ఆర్డర్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కూడా లేడు. అందుకే హెట్మెయర్‌ను కొనుగోలు చేయవచ్చు.

శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నిష్క్రమించిన తర్వాత, శ్రేయాస్ అయ్యర్ కూడా వేలంలో ఉంటాడు. ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌పై ఆర్‌సీబీ కన్ను వేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌కు స్థిరత్వం కల్పించేందుకు ఆర్‌సీబీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కాకుండా, జట్టు మేనేజ్‌మెంట్ అయ్యర్ రూపంలో కెప్టెన్ ఎంపికను కూడా పొందవచ్చని తెలుస్తోంది.

దేవదత్ పడిక్కల్: ఈ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ RCB కోసం ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు అత్యధికంగా పరుగులు సాధించాడు. అయితే వీరిని రిటైన్ చేసుకునేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపలేదు. కానీ, RCB మాత్రం పడిక్కల్‌ను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసిందని తెలుస్తోంది.

ఆర్. అశ్విన్: RCB బౌలర్‌గా సిరాజ్‌ను కొనసాగించింది. దీంతోపాటే మెరుగైన బౌలర్లను కూడా తయారుచేసుకోవాలి. దీంతో ఆర్‌సీబీ కళ్లు ఆర్. అశ్విన్‌పై నిలిచాయి. ఇటీవలి కాలంలో టీ20ల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న అశ్విన్‌పై అన్ని జట్లు ఆశపడుతున్నాయి.





























