- Telugu News Photo Gallery Cricket photos IND vs NZ, 2nd Test: Team India Bowler R. Ashwin eye on Richard Hadlee Big Record in Mumbai Test
IND vs NZ: ఆ భారత స్టార్ బౌలర్ ముందు సూపర్ ఛాన్స్.. ముంబై టెస్టులో నంబర్ వన్‌గా మారేందుకు అవకాశం..!
Ashwin: ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనున్న ఈ సిరీస్‌లోని రెండవ, చివరి టెస్టులో హెడ్లీని వెనక్కి నెట్టి ఆర్. అశ్విన్ అగ్రస్థానంలో ఉండగలడు.
Updated on: Dec 02, 2021 | 5:07 PM

ముంబై టెస్టులో అశ్విన్ కోసం పెద్ద అవకాశంగా ఎదరుచూస్తోంది. ఈ టెస్టులో అతడు నంబర్ వన్ బౌలర్‌గా అవతరించే అవకాశం ఉంది. అయితే ఇది ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మాత్రం కాదు. బౌలర్ల గ్రూప్‌లో అశ్విన్ ఇప్పటికే రెండవ స్థానంలో ఉన్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అగ్రస్థానంలో ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఈ నంబర్ వన్ టైటిల్ రెండు దేశాల మధ్య జరిగిన సిరీస్‌లో అత్యధిక వికెట్లతో ముడిపండి ఉంది.

ప్రస్తుతం ఈ జాబితాలో కివీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని వెనుక అశ్విన్ ఉన్నాడు. అయితే ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనున్న సిరీస్‌లో రెండో, చివరి టెస్టులో అశ్విన్ హెడ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో ఉండగలడు.

ఇటీవలే హర్భజన్ సింగ్ రికార్డును బ్రేక్ చేసి టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.

రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును బద్దలు కొట్టాలంటే ముంబై టెస్టులో అశ్విన్‌కి 8 వికెట్లు కావాలి. భారత్‌పై 14 టెస్టుల్లో హెడ్లీ 65 వికెట్లు పడగొట్టాడు. అక్కడ ఆర్. అశ్విన్ ఇప్పటి వరకు 15 ఇన్నింగ్స్‌ల్లో 58 వికెట్లు తీశాడు.





























