- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 auction sunrisers hyderabad can target these five players
IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?
ఐపీఎల్ 2022 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కాగా, మరొకరు అబ్దుల్ సమద్, ఇంకొకరు బౌలర్ ఉమ్రాన్ మాలిక్..
Updated on: Dec 02, 2021 | 7:03 PM

ఐపీఎల్ 2022 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కాగా, మరొకరు అబ్దుల్ సమద్, ఇంకొకరు బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ఇదిలా ఉంటే.. పూర్తి టీంను సిద్దం చేసుకునేందుకు ఎస్‌ఆర్‌హెచ్ మెగా వేలంలో కీలక ఆటగాళ్లపై గురి పెట్టింది. వారెవరో ఇప్పుడు చూద్దాం..

శ్రేయాస్ అయ్యర్: ఐపీఎల్ 2022 మెగా వేలంలో, దాదాపుగా ప్రతీ ఫ్రాంచైజీ.. అయ్యర్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రేయాస్ అయ్యర్ సూపర్బ్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా శ్రేయాస్ అయ్యర్‌పై దృష్టి సారిస్తుంది. మిడిల్ ఆర్డర్‌లో అతడు ఉంటే.. బ్యాటింగ్ పటిష్టంగా ఉంటుందని చెప్పొచ్చు.

కెఎల్ రాహుల్: పంజాబ్ కింగ్స్ జట్టుకు దూరంగా ఉన్న కెఎల్ రాహుల్‌ను వచ్చే సీజన్‌లో హైదరాబాద్ దక్కించుకునే అవకాశం ఉంది. ఓపెనర్‌గా రాహుల్ బోలెడన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్‌ని సన్‌రైజర్స్ దక్కించుకుంటే.. వార్నర్ స్థానం భర్తీ కావడమే కాదు.. ఒంటిచేత్తో విజయాలు అందించే బ్యాట్స్‌మెన్ కూడా దొరికినట్లే.

దేవదూత్ పడిక్కల్: ఐపీఎల్ 2022లో ఓపెనర్ల కోసం సన్‌రైజర్స్ వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే దేవదూత్ పడిక్కల్ మంచి ఆప్షన్. ఇతడు గతేడాది RCB తరపున చక్కటి ప్రదర్శన కనబరిచాడు.

యుజ్వేంద్ర చాహల్: ఆరెంజ్ ఆర్మీ యుజ్వేంద్ర చాహల్‌పై కన్నేసింది. వికెట్ టేకింగ్ బౌలర్ అయిన చాహల్.. ఇప్పటివరకు ఆర్సీబీకి ప్రధాన బలం. అందుకే చాహల్‌పై ఎస్‌ఆర్‌హెచ్ కన్నేసింది.

రవిచంద్రన్ అశ్విన్: రషీద్ ఖాన్ ఒకవేళ మెగా ఆక్షన్‌లో దొరక్కపోతే.. సన్‌రైజర్స్‌కు అశ్విన్ సరైన ఆప్షన్. టీ20ల్లో అశ్విన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.





























