Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Tour of South Africa: భారత్ పర్యటన వాయిదా..! ఒమిక్రాన్ వేరియంటే కారణం..

టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన వారం రోజుల పాటు వాయిదా పడినట్లు సమచారం. అయితే దీనీపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌతాఫ్రికాలో కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది...

India Tour of South Africa: భారత్ పర్యటన వాయిదా..! ఒమిక్రాన్ వేరియంటే కారణం..
India Tour Postponed
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 02, 2021 | 12:58 PM

టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన వారం రోజుల పాటు వాయిదా పడినట్లు సమచారం. అయితే దీనీపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌతాఫ్రికాలో కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న బీసీసీఐ జట్టు ఎంపికను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. వాయిదా పడిన విషయం బీసీసీఐ అధికారికంగా ఇంకా నిర్ధారణ చేయాలేదు.

నిజానికి కాన్పూర్ టెస్టు ముగిసిన తర్వాత సెలెక్షన్ సమావేశం జరగాల్సి ఉందని, న్యూజిలాండ్‌తో జరుగుతున్న 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు 8 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఇప్పటి వరకు ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ జరగలేదని తెలుస్తుంది.

దక్షిణాఫ్రికా పర్యటనపై BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం స్పందించారు. బోర్డు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నందని.. పర్యటన షెడ్యూల్‌లోనే ఉందని చెప్పారు. “నిర్ణయించుకోవడానికి మాకు ఇంకా సమయం ఉంది. డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు జరగనుంది. దాని గురించి ఆలోచిస్తాం. ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం ఎల్లప్పుడూ BCCI మొదటి ప్రాధాన్యత. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి” అని గంగూలీ చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. భారత్ దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‎లు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనుంది. అయితే కొన్ని మ్యాచ్‎లు కుదించచ్చని తెలుస్తుంది.

Read Also.. Virat Kohli ODI Captaincy: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఈ వారం సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ..