Virat Kohli:: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఈ వారం సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ..

India ODI Captain: భారత వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఈ వారంలో తేలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికా పర్యటనకు క్లియరెన్స్ ఇస్తే జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఈ వారం సమావేశమవుతారు...

Virat Kohli:: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఈ వారం సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ..
Virat Kohli
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 02, 2021 | 12:09 PM

భారత వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఈ వారంలో తేలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికా పర్యటనకు క్లియరెన్స్ ఇస్తే జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఈ వారం సమావేశమవుతారు. చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ కోహ్లీని వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగించాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో భారత జట్టు టూర్ కొనసాగుతుందని బీసీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అయినప్పటికీ వారు ఆ దేశంలో కొత్త COVID-19 వేరియంట్ పుట్టుకురావటంతో అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ‘‘భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తాం. మేము మా వైపు నుంచి అన్ని సిద్ధం చేసి, ఆపై ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉంటాం. పర్యటనను నిలిపివేయమని ప్రభుత్వం మాకు చెబితే, మేము చేస్తాం, అయితే మేము జట్టును ఎంపిక చేసి సిద్ధంగా ఉంచాలి” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి బుధవారం చెప్పారు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. భారత్ రాబోయే ఏడు నెలల్లో విదేశాల్లో ఆరు (దక్షిణాఫ్రికా,ఇంగ్లండ్‎తో మూడు చొప్పున) మ్యాచ్‎లు ఆడనుంది. అలాగే తొమ్మిది ODIలు ఉన్నాయి. ప్రస్తుతం బీసీసీఐ రెండు ఆలోచనలు చేస్తుంది. కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నందున కోహ్లీని కెప్టెన్‎గా కొనసాగించడం. భారతదేశంలో జరగనున్న 2023 ODI ప్రపంచ కప్ కోసంశక్తివంతమైన జట్టును సిద్ధం చేయడానికి రోహిత్‌కు తగినంత సమయం ఇవ్వడం. అయితే కోహ్లీ వన్డే కెప్టెన్‌గా ఉంచడంపై బీసీసీఐ అధ్యక్షుడు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. కోహ్లీ కెప్టెన్‎గా ఏ ఒక్క ఐసీసీ టోర్నీ గెలవలేదు. వ్యక్తిగతంగా అతని రికార్డు బాగుంది.

ప్రస్తుతానికి BCCI దక్షిణాఫ్రికాతో పూర్తి సిరీస్ ఆడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. అయితే, మూడు టెస్టుల సిరీస్‌ను కుదించడంపై చర్చలు జరుగుతున్నాయి. సౌతాఫ్రికా టార్‎లో భారత్ మూడు టెస్ట్‎లు ఆడనుంది.

Read Also.. CSK: మొయిన్ అలీని ఎందుకు రిటైన్ చేసుకున్నామంటే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎస్‎కే సీఈవో..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా