Talambralu Chettu: పిచ్చి మొక్క అని పట్టించుకోని.. ఈ చెట్టు ఆకులు మోకాళ్ళ నొప్పికి దివ్య ఔషధం..

Talambralu Chettu: పిచ్చి మొక్క అని పట్టించుకోని.. ఈ చెట్టు ఆకులు మోకాళ్ళ నొప్పికి దివ్య ఔషధం..
Lantana Camara

Talambralu Chettu: ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. మన చుట్టూ ఉండే ఉండే ఎన్నో రకాల మొక్కలు మనిషికి ఉపయోగపడతాయి. కొన్నింటిని పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు..

Surya Kala

|

Dec 04, 2021 | 11:08 AM

Talambralu Chettu: ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. మన చుట్టూ ఉండే ఉండే ఎన్నో రకాల మొక్కలు మనిషికి ఉపయోగపడతాయి. కొన్నింటిని పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ భావిస్తాం.. వాటిని పట్టించుకోము.. అయితే అటువంటి మొక్కల్లో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. అలాంటి పిచ్చి మొక్కలో ఒకటి తలంబ్రాల మొక్క. ఈ చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి.కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు. ఈరోజు రోడ్డు పక్కన పొలాల గట్ల మీద ఎక్కడపడితే అక్కడ కనిపించే తలంబ్రాల చెట్టు స్వస్థలం ఆఫ్రికా, అమెరికా ఖండాలు.  వీటిని హిమాచల్ ప్రదేశ్ లో ఫర్నీచరు, కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక ఏపీలోని చిత్తూరు జిల్లాలో, తమిళనాడు లోని నతములో బుట్టలు అల్లడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆరోగ్యానికి పై పూతలా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చర్మ సమస్యలను తగ్గించటంలో మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంతేకాదు గజ్జి,తామర వంటి చర్మ సమస్యల చికిత్సలో ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈరోజు తలంబ్రాల చెట్టు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

చర్మ సమస్యల నివారణకు: 

తలంబ్రాల చెట్టు ఆకుల్లో క్రిమినాశక, యాంటీమైక్రోబయాల్ లక్షణాలున్నాయి. ఇవి గాయాలను నయం చేయడానికి సహాయపడతాయి. అందుకనే పొలాల్లో పనులు చేసినప్పుడు ఎవరికైనా గాయం అయితే వెంటనే ఈ ఆకులను నలిపి    కట్టు కడతారు.  అంతేకాదు మీజిల్స్, చికెన్ పాక్స్, గజ్జి ,చర్మ ఫంగస్‌ను తగ్గించడానికి శక్తివంతమైన హెర్బగా ఉపయోగిస్తారు.

కీళ్ల నొప్పుల నివారణకు: 

మారుతున్నా కాలంలో వచ్చిన మార్పులతో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్స్ బదులు ఈ సింపుల్ చిట్కాని ఫాలో కండి.  తలంబ్రాల ఆకులను ఆముదం ఆకులను కలిపి ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఈ ఆకులను ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పైపూతగా రాసి ఒక క్లాత్ తో గట్టిగా కట్టాలి. ఇలా నెలరోజులపాటు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వెన్నునొప్పి, రుమాటిజం,  కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

దగ్గు గొంతు నొప్పి నివారణకు: 

దగ్గు గొంతు నొప్పి నివారణకు ఈ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

 పాము కాటుకి చికిత్స: 

ఇది సాంప్రదాయకంగా పాముకాటుకు చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. పురుగుల కుట్టడం , కాటును ఉపశమనం కోసం ఈ హెర్బ్ ను ఉపయోగించవచ్చు.

ఇతర వ్యాధులకు 

ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంది. దీంతో ఫ్రీ రాడికల్స్ నివారణ కోసం దీనిని ఉపయోగించవచ్చు. అంతేకాదు శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ సమ్మేళనాల ఉండడం వలన కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి వ్యాధులను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి పెంచండం, శరీరం నుండి విషవ్యర్థాలను తొలగించండం, పంటి నొప్పికి చికిత్స చేయండం వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.

ఈ ఆకుల్లో మిథనాలిక్ , ఇథనాలిక్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయి. అందువలన ఈ ఆకులను ఎండబెట్టి పొగవేస్తే..  దోమలు కీటకాలను తరిమికొడతాయి.

అయితే ఈ చెట్టుపై భారతదేశంలో శాస్త్రీయ అధ్యయనాన్ని చేశారు. ఈ ఆకుల్లో శక్తివంతమైన పురుగుమందుల లక్షణాలను కలిగి ఉంటాయి.. ఇవి హానికరమైన కీటకాలను చంపడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు తలంబ్రాల ఆకులు టాక్సిన్లతో నిండి ఉంటుంది. కనుక ఈ చెట్టు ఆకులను ఆరోగ్యపరంగా ఉపయోగించే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణున్ని సంప్రదిస్తే మంచిది.

Also Read:  ఎయిర్ పోర్ట్‌లో స్వాగతం చెప్పడానికి వచ్చిన కొడుకుని చెప్పుతో కొట్టి హత్తుకున్న తల్లి.. వీడియో వైరల్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu