Video Viral: ఎయిర్ పోర్ట్‌లో స్వాగతం చెప్పడానికి వచ్చిన కొడుకుని చెప్పుతో కొట్టి హత్తుకున్న తల్లి.. వీడియో వైరల్..
Video Viral: మన ఇంటికి ఎవరైనా చుట్టాలు, స్నేహితులు వస్తున్నారంటేనే వారి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం .. అదే అరుదుగా వచ్చే అతిధి అయితే..
Video Viral: మన ఇంటికి ఎవరైనా చుట్టాలు, స్నేహితులు వస్తున్నారంటేనే వారి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం .. అదే అరుదుగా వచ్చే అతిధి అయితే స్వాగతసత్కారాలను ఓ రేంజ్ లో చేస్తాం.. ఇక ఇంట్లోని కుటుంబ సభ్యులు దేశం కానీ దేశం వెళ్లి.. కొన్ని ఏళ్ల తర్వాత ఇంటికి వస్తుంటే.. వారికి వెల్కమ్ చెప్పడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్లిమరీ ఎదురు చూస్తారు. ఆ సమయంలో పూజ బొకే, పూల దండలు, సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు, ఫ్లెక్సీలు, బ్యాండ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎయిర్ పోర్టులో తమవారు కనిపించగానే.. ఆతృతగా ఎదురెళ్లి.. ఆత్మీయంగా హత్తుకుంటారు.. కొంతమంది.. సంతోషంతో కన్నీరుకూడ పెట్టుకుంటారు. ఇలాంటివి సర్వసాధారణంగా చూసేవి. అయితే ఇప్పుడు తన కొడుకుకు చెప్పుతో కొట్టి మరీ స్వగతం చెప్పింది. ఈ ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..
పాకిస్థాన్ లోని ఎయిర్‌పోర్ట్‌లో అన్వర్ జలాని అనే వ్యక్తి ఓ చేతిలో బోర్డు పట్టుకుని, మరోచేతిలో ప్లేవర్ బొకే పట్టుకుని తన తల్లి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఎయిర్ పోర్టులో తల్లి బ్యాగ్ తీసుకుని ఎంటర్ అయ్యింది. మిస్‌యూ అమ్మ.. అంటూ ఫ్లకార్డు పట్టుకోని మరీ ఎదురుచూస్తున్న అన్వర్ జలాని దగ్గరకు తల్లి వచ్చింది. స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు అన్వర్‌ను చూసి ఆ తల్లి హఠాత్తుగా కాలినుంచి చెప్పు తీసుకుని చితక్కొట్టింది. అనంతరం ఆ తల్లి కొడుకుని ప్రేమతో హత్తుకుంది.
ఈ వీడియో అన్వర్ జిలానీ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మ నీకు వెరైటీగా థాంక్స్ చెప్పింది. వావ్.. మీ అమ్మ ఎంతగా మిమ్మల్ని మిస్ అయ్యారో.. అంటూ కామెంట్ చేశారు. మరికొందరు నిన్ను భారీ ఆశీర్వదించింది అంటున్నారు.
View this post on Instagram
Also Read: రష్యాలో కరోనా మరణ మృదంగం .. గత అక్టోబర్‌లో భారీగా మరణాలు.. వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం