AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: కలవరం రేపుతున్న కొత్త వేరియంట్.. 38 దేశాలకు పాకిన ఒమిక్రాన్..!

రూపం మార్చుకున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికాలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా మహమ్మారి క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది.

Omicron Variant: కలవరం రేపుతున్న కొత్త వేరియంట్..  38 దేశాలకు పాకిన ఒమిక్రాన్..!
Omicron Variant Corona
Balaraju Goud
|

Updated on: Dec 04, 2021 | 10:10 AM

Share

Omicron Variant Coronavirus: రూపం మార్చుకున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికాలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా మహమ్మారి క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. కెనడాలో ఈ తరహా కేసులు 15కు చేరాయి. దేశంలో తొలికేసు గతనెల 28న నమోదయింది. ఆఫ్రికా దేశమైన నైజీరియా నుంచి ఒంటారియకు వచ్చిన ఇద్దరికి ఈ వైరస్‌ సోకింది. అటు 12 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, కరోనా కొత్త Omicron వేరియంట్ ప్రపంచంలోని 38 దేశాలకు చేరుకుంది.

కెనడియన్ పబ్లిక్ హెల్త్ అధికారులు శుక్రవారం మాట్లాడుతూ దేశంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ (COVID 19) యొక్క మొత్తం 15 కేసులు నమోదయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన అనారోగ్య కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న 50 ఏండ్లు పైబడినవారికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు నేషనల్‌ అడ్వైజరీ బోర్డు సూచించిందని వెల్లడించారు. కాగా, వారిలో 12 ఏండ్ల చిన్నారి కూడా ఉందని, ఆమె ఈ మధ్యే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిందని చీఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ థెరిసా టామ్‌ తెలిపారు. టీకా శ్రేణి పూర్తయిన 6 నెలల తర్వాత 50 ఏళ్లు పైబడిన వారందరూ బూస్టర్ డోస్‌ను అందుకోవాలని ఇమ్యునైజేషన్‌పై నేషనల్ అడ్వైజరీ బోర్డ్ చేసిన సిఫార్సుకు మద్దతు ఇస్తున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ మినహా అన్ని దేశాల నుండి విమానంలో వచ్చే వ్యక్తులు COVID 19 పరీక్ష చేయించుకోవాలని గత వారమే ప్రకటించింది. అలాగే, దక్షిణ ఆఫ్రికా నుండి ప్రయాణికులను నిషేధించింది. టొరంటోలో మూడు ఒమిక్రాన్‌ కేసు నమోదయిందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. అందులో ఇద్దరు నైజీరియా నుంచి, మరొకరు స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చారని వెల్లడించారు. కాగా, ఆఫ్రికాతోసహా అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై కెనడా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

అటు ఫ్రాన్స్‌లోనూ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మొదటి 9 కేసులతో పోల్చితే, ఫ్రెంచ్ దేశంలో 12 కరోనా వైరస్ ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆలస్యంగా తెలిపింది. మరోవైపు, Omicron వేరియంట్‌కు సంబంధించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంక్రమణకు “చాలా ఎక్కువ” ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రభుత్వ ఉన్నత శాస్త్రీయ సలహాదారు ప్రకారం, జనవరి చివరి నాటికి ఈ వైరస్ ఫ్రాన్స్‌లో ఆత్యధిక కేసులు నమోదయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రస్తుతం COVID 19 వ్యాధి ఐదవ వేవ్‌తో పోరాడుతోంది.

ఇదిలావుంటే, బ్రిటన్‌లో మరో 75 కరోనా ఓమ్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ కొత్త కేసుతో, బ్రిటన్‌లో మొత్తం 104 ఓమిక్రాన్ ఆఫ్ కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం వరకు స్కాట్లాండ్‌లో మరో 16 కేసులను గుర్తించారు. దీంతో దేశంలో మొత్తం 29 మంది ఈ కొత్త వేరియంట్‌కు బాధితులయ్యారు.

Read Also… Corona Virus: రష్యాలో కరోనా మరణ మృదంగం .. గత అక్టోబర్‌లో భారీగా మరణాలు.. వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!