Corona Virus: రష్యాలో కరోనా మరణ మృదంగం .. గత అక్టోబర్‌లో భారీగా మరణాలు.. వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Corona Virus: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత రష్యాలో అక్టోబర్ నెలలో కోవిడ్ -19 తో మరణించినవారి సంఖ్య అధికమని .. అక్టోబర్ నెలలోనే  74,893 మంది మరణించారని రష్యా స్టేట్ స్టాటిస్టిక్స్..

Corona Virus: రష్యాలో కరోనా మరణ మృదంగం .. గత అక్టోబర్‌లో భారీగా మరణాలు.. వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
Russia Corona
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2021 | 9:22 AM

Corona Virus: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత రష్యాలో అక్టోబర్ నెలలో కోవిడ్ -19 తో మరణించినవారి సంఖ్య అధికమని .. అక్టోబర్ నెలలోనే  74,893 మంది మరణించారని రష్యా స్టేట్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ మహమ్మారి రోజు రోజుకీ విజృభించడంతో రష్యా దేశం పోరాడుతుంది. ఈ వైరస్ తో గత ఏడాది ఏప్రిల్ నుంచి 2021 అక్టోబర్ ల మధ్య మొత్తం    537,000 కంటే ఎక్కువ మంది మరణించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. అక్టోబర్‌లో దాదాపు 75,000 మరణించగా వారిలో 58,822 కోవిడ్-19 వల్ల సంభవించాయని అధికారులు ధృవీకరించారు. 9,912 మంది ఇతర మరణాలుగా నమోదయ్యాయి. అయితే ఈ మరణాలకు కారణం ఏమిటనేది పరీక్ష ద్వారా నిర్ధారించలేదని రష్యా స్టేట్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ చెప్పింది.

టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఉప ప్రధాన మంత్రి టాట్యానా గోలికోవా మాట్లాడుతూ, 2020లో ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్‌లో రష్యా మొత్తం మరణాలు 20.3% పెరిగాయని.. దీనికి కారణం కరోనా అని చెప్పారు. గత కొన్ని నెలాలుగా రష్యా లో ప్రాణాంతకమైన కరోనావైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రికార్డ్ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ అంటువ్యాధుల ద్వారా చోటు చేసుకుంటున్న మరణాలు క్రమం తప్పకుండా ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. అయితే గత రెండు వారాల నుంచి మాత్రమే కొంచెం తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి.

రష్యాలో ఈ మేరకు కరోనా కల్లోలం సృష్టించడానికి కారణం ప్రజలు కరోనా నిబంధనలు పాటించడకపోవడం.. వ్యాక్సిన్ కార్యక్రమం మందగించడం కారణమని తెలుస్తోంది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వారు తప్పనిసరిగా  కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.  ఫిబ్రవరి 1 నాటికి రష్యా లో పూర్తి స్థాయిలో టీకాలు వేయాలని శుక్రవారం తెలిపారు. అవసరమైన కార్మికులకు వ్యాక్సిన్ తప్పనిసరి చేశారు.  ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చిన రష్యాలోని దాదాపు 146 మిలియన్ల మందిలో 40% మంది టీకాలు తీసుకున్నారు. రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్.. స్పుత్నిక్ V ను ఎప్పుడో ప్రపంచంలోని  అనేక దేశాలు ఆమోదించాయి.

మరోవైపు శుక్రవారం దక్షిణాఫ్రికా నుండి రష్యాకు తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారి పరీక్ష నమూనాలను కొత్త ఓమిక్రాన్ వేరియంట్  అవునో కాదో తెలుసుకోవడానికి అధ్యయనం చేస్తున్నారని రష్యా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని రష్యా పబ్లిక్ హెల్త్ వాచ్‌డాగ్ రోస్పోట్రెబ్నాడ్జోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా రష్యాకి వచ్చే దక్షిణాఫ్రికా, పొరుగు దేశాల నుండి తిరిగి వచ్చే రష్యన్ పౌరులందరూ 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాలని ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు రష్యాలో గత 24 గంటల్లో 32,930 కొత్త కేసులు, 1,217 మరణాలు నమోదయ్యాయి.

Also Read:  అంబులెన్స్‌లో ప్రసవం.. సమయస్ఫూర్తితో వైద్యం అందించిన సిబ్బంది.. తల్లీబిడ్డా క్షేమం