Geetha Gopinath: కాలేజీకి ఒకే బస్సులో వెళుతూ.. గీతా గోపీనాథ్- ఇక్బాల్‌ల పరిచయం అలా మొదలైంది..
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఉన్నత స్థాయి చీఫ్ ఎకనామిస్ట్, ఇండియన్ అమెరికన్ గీతా గోపీనాథ్.. IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందుతున్నట్లు ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఉన్నత స్థాయి చీఫ్ ఎకనామిస్ట్, ఇండియన్ అమెరికన్ గీతా గోపీనాథ్.. IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందుతున్నట్లు ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు నెంబర్ 2గా ఉన్నజియోఫ్రె విలియమ్ సెయిజి ఒకమోటోవచ్చే ఏడాది మొదట్లో బాధత్యల నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గీతా గోపినాథ్ భర్తీ చేయనున్నారు. కాగా ఒక మహిళ.. అందులోనూ భారతదేశ మూలాలున్న ఆమె ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి . ఈక్రమంలో కలకత్తాకు చెందిన ఈ ఆర్థిక వేత్తకు అంతర్జాతీయంగా పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గీత తల్లి విజయలక్ష్మి ఈవిషయంపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒక మగాడి విజయం వెనక ఆడది ఉన్నట్లే.. భర్త ప్రోత్సాహం లేకుండా ఆడవాళ్లు విజయం సాధించడం అంత సులభం కాదు.. నా కూతురు సాధించిన విజయంలో నా అల్లుడు (ఇక్బాల్ ధలివాల్) పాత్ర కూడా ఎంతో ఉంది’ అని విజయలక్ష్మి చెప్పుకొచ్చారు.
అలా మొదలైంది.. గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్ విషయానికొస్తే ఆయన ఓ మాజీ ఐఏఎస్. ప్రస్తుతం మస్సాచుషెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, జే-పాల్‌లో ఎకనమిక్స్ విభాగంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గీత లాగే ఇక్బాల్ కూడా ఓ ఆర్థిక మేధావే. 1972 బెంగళూరులో ఆయన జన్మించారు. తండ్రి బీఎస్‌ఎఫ్‌లో విధులు నిర్వహించగా… తల్లి ఓ పాఠశాలను నిర్వహించారు. ఆయనకు ఓ సోదరి ఉంది. ప్రస్తుతం ఈమె వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా డిల్లీ మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే 14 ఏళ్ల పాటు విద్యాభ్యాసం కొనసాగించాడు ఇక్బాల్. అక్కడి యూనివర్సిటీలోనే బీఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. డిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే ఇక్బాల్‌కు పరిచయమైంది గీత. ఇద్దరూ కలిసి ఒకే బస్సులో కళాశాలకు వెళ్లేవారట. కొద్ది రోజుల్లోనే వారి పరిచయం స్నేహంగా మారింది. ఆతర్వాత ఉన్నత చదువుల కోసం ఇద్దరూ ప్రిన్స్‌టన్ వెళ్లారు. అక్కడే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆతర్వాత ఇండియాకు వచ్చిన ఇక్బాల్ 1994 నుంచి 1996 వరకు గుర్గావ్‌లోని సంత్ మెమోరియల్ పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1994లో మొదటిసారి సివిల్స్ పరీక్షలకు హాజరయ్యాడు. ఆలిండియా 229 ర్యాంక్ సాధించాడు. అయితే ఐఏఎస్ కావాలన్న తలంపుతో 1996లో మళ్లీ యూపీఎస్సీ పరీక్షలు రాశాడు. ఈసారి ఆలిండియా టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. ఐదేళ్ల పాటు తమిళనాడు క్యాడర్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆతర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లిపోయారు. కాగా గీత- ఇక్బాల్ జంటకు రోహిల్ అనే బాబు ఉన్నాడు .
Also Read:
Honda: భారత్‌లో సరికొత్త సేవలు అందించనున్న హోండా.. వాహనాలకు బ్యాటరీ మార్పిడి సేవలు..!