AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD vs IPO Investment: ఎఫ్‌డీల్లో డబ్బు ఐపీఓలకు.. మారిన పెట్టుబడిదారుల ధోరణి.. రూ. 2.67 లక్షల కోట్లు తగ్గిన బ్యాంకు డిపాజిట్లు..!

గత 12-18 నెలలుగా భారత మార్కెట్‌లో IPOలక్రేజ్ విపరీతంగా కొనసాగుతోంది. దీంతోనే ప్రజలు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకొని మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు..

FD vs IPO Investment: ఎఫ్‌డీల్లో డబ్బు ఐపీఓలకు.. మారిన పెట్టుబడిదారుల ధోరణి.. రూ. 2.67 లక్షల కోట్లు తగ్గిన బ్యాంకు డిపాజిట్లు..!
Fixed Deposits Vs Ipo Investment
Venkata Chari
|

Updated on: Dec 03, 2021 | 8:05 PM

Share

Fixed Deposits vs IPO Investment: గత 12-18 నెలలుగా భారత మార్కెట్‌లో IPOలక్రేజ్ విపరీతంగా కొనసాగుతోంది. దీంతోనే ప్రజలు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకొని మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. గత 15 రోజుల్లో బ్యాంకుల డిపాజిట్లలో రూ.2.67 లక్షల కోట్లు తగ్గుదల నమోదైందంటేనే ఈ విషయం అర్థం చేసుకోవచ్చు.

ఆర్బీఐ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..! భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గణాంకాల ప్రకారం, దీపావళి తర్వాత బ్యాంకు డిపాజిట్లలో భారీ క్షీణత నెలకొంది. నవంబర్ 19తో ముగిసిన పక్షం రోజుల్లో బ్యాంకు డిపాజిట్లు రూ.2.67 లక్షల కోట్లు తగ్గి రూ.157.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే నవంబర్ 5, 21తో ముగిసిన పక్షం రోజుల్లో రూ.3.3 లక్షల కోట్ల డిపాజిట్లు పెరిగాయని తెలిపింది.

ఎస్‌బీఐ నివేదికలో.. డిపాజిట్లలో ఈ పెరుగుదల, తదుపరి మందగమనం ధోరణి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని ఎస్‌బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ తన నివేదికలో తెలిపారు. డిపాజిట్లలో ఇంత భారీ వృద్ధి 1997 తర్వాత ఐదవసారి నమోదైంది. నవంబర్ 25, 2016తో ముగిసిన పక్షం రోజుల్లో రూ.4.16 లక్షల కోట్లు, సెప్టెంబర్ 30, 2016 పక్షం రోజుల్లో రూ.3.55 లక్షల కోట్లు, మార్చి 29, 2019 పక్షం రోజుల్లో రూ.3.46 లక్షల కోట్లు, 2019 మార్చి 29 నాటికి రూ.3.41 లక్షల కోట్లు పెరిగాయి.

నవంబర్ 2016లో డిపాజిట్లు పెరిగాయి.. నవంబర్ 2016లో బ్యాంకు డిపాజిట్లు పెద్దఎత్తున నోట్ల రద్దు కారణంగానే పెరిగినట్లు నివేదిక పేర్కొంది. కొత్త యుగం, ఇతర కంపెనీల ఇష్యూ తర్వాత, స్టాక్ మార్కెట్లలో బూమ్ ఆశతో ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకున్నారని మేం నమ్ముతున్నామని వారు అంటున్నారు. నవంబర్ 5, 2021తో ముగిసిన పక్షం రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్ల ప్రవాహం పెరిగింది. అయితే, అటువంటి పెరుగుదల లేనప్పుడు, బ్యాంకింగ్ డిపాజిట్లలో ఊపందుకుంది. దాదాపు 80 శాతం డిపాజిట్లు ఉపసంహరించుకున్నారని పేర్కొంది. డిజిటల్ లావాదేవీలు ఊపందుకోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగదు వినియోగం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే, మేం అన్ని వాణిజ్య బ్యాంకుల త్రైమాసిక డేటాను పరిశీలిస్తే, Q1, Q2లలో డిపాజిట్ వృద్ధి 2.5 శాతంగా నమోదైంది.

ఇదిలా ఉండగా, నవంబర్ 5తో ముగిసిన 15 రోజుల్లో అన్ని వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ రూ.1.18 లక్షల కోట్లు పెరిగింది. దీనికి పండుగ డిమాండ్లే కారణం కావచ్చు. ఇది వార్షిక ప్రాతిపదికన 7.1 శాతంగా పెరిగింది. సెప్టెంబర్ 2021లో 15.6 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌లోకి చేరారని నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 2020లో 7.5 లక్షల మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10.3 లక్షల మంది, మేలో 14.8 లక్షలు, జూన్‌లో 14.9 లక్షలు, జులైలో 15.4 లక్షలు, ఆగస్టులో 14.9 లక్షల మంది ఇన్వెస్టర్లు చేరారు. గతేడాది ఏప్రిల్‌లో 4.1 లక్షలు, మేలో 4.2 లక్షలు, జూన్‌లో 5.6 లక్షలు, జూలైలో 6.7 లక్షలు, ఆగస్టులో 8.2 లక్షల మంది ఇన్వెస్టర్లు చేరారు.

Also Read: ICICI Midcap 150 Index: ఐసీఐసీఐ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్‌.. వంద రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు

Omicron Affect: క్రిస్మస్.. న్యూ ఇయర్ వేడుకలపై ఒమిక్రాన్ క్రీనీడ.. పర్యాటక రంగం పరిస్థితి గందరగోళం..