PM Modi: డిజిటల్ విప్లవం కరెన్సీ చరిత్రను మార్చేసింది.. ఇన్ఫినిటీ ఫోరం ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: డిజిటల్ విప్లవం కరెన్సీ చరిత్రను మార్చేసింది.. ఇన్ఫినిటీ ఫోరం ప్రారంభించిన ప్రధాని మోడీ
Pm Modi

ఫిన్‌టెక్ చొరవను ఫిన్‌టెక్ విప్లవంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతి పౌరునికి ఆర్థిక బలాన్ని అందించే విప్లవం ఇది.

KVD Varma

|

Dec 03, 2021 | 8:15 PM

PM Modi: ఫిన్‌టెక్ చొరవను ఫిన్‌టెక్ విప్లవంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతి పౌరునికి ఆర్థిక బలాన్ని అందించే విప్లవం ఇది. మొబైల్ చెల్లింపు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దీని ద్వారా రికార్డు స్థాయిలో చెల్లింపు జరిగింది అని ప్రధాని చెప్పారు. ఈరోజు (డిసెంబర్ 3) ఇన్ఫినిటీ ఫోరమ్‌ను ప్రధాని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరెన్సీ చరిత్ర అద్భుతమైన అభివృద్ధిని చూపుతుందని మోడీ అన్నారు. మానవులు పరిణామం చెందడంతో, మనం పరస్పర చర్య చేసే విధానం కూడా పెరిగింది. ఇంతకుముందు ఇది వస్తువుల లావాదేవీల విధానంగా ఉండేది. తరువాత అది నాణేల వద్దకు చేరుకుంది. ఆపై నోటు చలామణిలోకి వచ్చింది.అదిప్పుడు పూర్తిగా డిజిటల్‌గా మారిపోయింది అంటూ ప్రధాని వివరించారు.

మొబైల్ చెల్లింపులతో లావాదేవీలను వేగవంతం చేయడం

భారత్‌లో తొలిసారిగా గత ఏడాది ఏటీఎంల నుంచి పంపిణీ చేసిన నగదు కంటే మొబైల్ చెల్లింపుల లావాదేవీలు రికార్డు సృష్టించాయని నరేంద్ర మోడీ అన్నారు. భౌతిక పధ్ధతి లేకుండా పూర్తిగా డిజిటల్ గా మారడం అనేది ఈరోజు వాస్తవం. ఈ సమయంలో భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ బ్యాంకుకు భౌతిక శాఖ ఉండదు. ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ దీనిపై కసరత్తు చేస్తోంది.

ప్రపంచంతో పంచుకోవడంలో నమ్మకం

మన అనుభవాలను, లక్షణాలను ప్రపంచంతో పంచుకోవాలనే నమ్మకం ఉందని మోడీ అన్నారు. నేను కూడా వారి నుండి నేర్చుకోవాలని నమ్ముతాను. మా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరుల జీవితాలను మెరుగుపరుస్తుంది. 70కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ నిర్వహిస్తుందని ప్రధాని వివరించారు.

శనివారం వరకు..

ఈ కార్యక్రమం శనివారం వరకు కొనసాగనుంది. ప్రధానమంత్రి కార్యాలయం చెప్పిన దాని ప్రకారం, మొదటి ఎడిషన్‌లో ఇండోనేషియా, దక్షిణాఫ్రికా,యూకే భాగస్వామ్య దేశాలు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పాలసీ, వ్యాపారం, సాంకేతికతలో ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చాలనేది ప్రణాళిక. మానవాళికి సమ్మిళిత వృద్ధి, సేవ కోసం ఫిన్‌టెక్ పరిశ్రమ ద్వారా సాంకేతికత, ఆవిష్కరణలను ఎలా ఉపయోగించాలో కూడా ఇది చర్చిస్తుంది.

ముఖేష్ అంబానీ, ఉదయ్ కోటక్ కూడా హాజరుకానున్నారు

ఇన్వెస్ట్ ఇండియా, ఫిక్కీ, నాస్కామ్‌తో పాటు నీతి ఆయోగ్ ఈ ప్రోగ్రామ్‌లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. మలేషియా ఆర్థిక మంత్రి తెంగ్కు జఫరుల్ అజీజ్, ఇండోనేషియా ఆర్థిక మంత్రి ములియాని ఇంద్రావతి, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సూన్, IBM కార్ప్ చైర్మన్ అరవింద్ కృష్ణ, కోటక్ బ్యాంక్ MD ఉదయ్ కోటక్ తదితరులు ముఖ్య వక్తలుగా పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి: Omicron Confusion: ప్రపంచ నిపుణులను తికమక పెడుతున్న ఒమిక్రాన్.. ఈ వేరియంట్ ప్రభావంపై విభిన్నఅంచనాలు.. మూడో వేవ్ తప్పదా?

Omicron Outbreak: వణికిస్తున్న ఒమిక్రాన్ విస్తరణ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి.. హాట్‌స్పాట్‌గా ఆ సిటీ!

Personal Loan: ఇన్‌కం ప్రూఫ్ లేకుండా పర్సనల్ లోన్ వస్తుందా? దీనికోసం ఏ పధ్ధతి అనుసరించాలి? తెలుసుకోండి!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu