AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: ఇన్‌కం ప్రూఫ్ లేకుండా పర్సనల్ లోన్ వస్తుందా? దీనికోసం ఏ పధ్ధతి అనుసరించాలి? తెలుసుకోండి!

వెంకటేష్ పీజీ విద్యార్థి. పీజీ పూర్తియిన వెంటనే ఒక ప్రత్యెక ప్రోగ్రామింగ్ కోసం కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాడు.

Personal Loan: ఇన్‌కం ప్రూఫ్ లేకుండా పర్సనల్ లోన్ వస్తుందా? దీనికోసం ఏ పధ్ధతి అనుసరించాలి? తెలుసుకోండి!
Personal Loan Rules
KVD Varma
|

Updated on: Dec 03, 2021 | 3:48 PM

Share

Personal Loan: వెంకటేష్ పీజీ విద్యార్థి. పీజీ పూర్తియిన వెంటనే ఒక ప్రత్యెక ప్రోగ్రామింగ్ కోసం కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. దానికి రెండు లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పటికే తన చదువుకోసం ఎంతో ఖర్చు చేసిన తన తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉంది. పీజీ తరువాత తాను అనుకున్న కోర్సు పూర్తి చేస్తే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తన కోచింగ్ కు సంబంధించిన ఖర్చుల కోసం ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాడు. దీనికోసం బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకుంటే బావుంటుందని స్నేహితుడు చెప్పాడు.

అయితే, వెంకటేష్ కు ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో మొదటిది బ్యాంకు మూడు నెలల జీతం స్లిప్ లు అడుగుతోంది. కానీ, తనకు ఉద్యోగం లేదు. ఈ క్రమంలో డిజిటల్ లెండింగ్ యాప్ నుంచి రుణం తీసుకోవచ్చా అనే అనుమానం వచ్చింది వెంకటేష్ కు. అయితే, దానివలన ఏమైనా సమస్యలు వస్తాయా అనే భయమో ఉంది. అంతే కాకుండా ఈ విధానంలో తెలియని ప్రాసెసింగ్ ఫీజులు ఏమైనా వసూలు చేస్తారా అనేది అతి పెద్ద అనుమానం. అంతేకాకుండా ఈరకమైన లోన్ తీసుకుంటే తన సిబిల్ స్కోర్ ప్రభావితం అవుతుందా అనేది కూడా వెంకటేష్ ను వేధిస్తున్న ప్రశ్న. వెంకటేష్ తన అనుమానాలను ఫైనాన్సింగ్ నిపుణుల వద్ద వ్యక్తం చేశాడు.

ఈ ఇబ్బంది వెంకటేష్ ఒక్కడిదే కాదు. చాలా మంది ఇటువంటి పరిస్థితి ఎదుర్కుంటారు. ఉద్యోగం లేకపోతే పర్సనల్ లోన్ బ్యాంకులు ఇవ్వవు. ఇక డిజిటల్ యాప్ లు కూడా నెల నేలా జీతం వచ్చే వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల వెంకటేష్ లాంటి వారికి పర్సనల్ లోన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. దీనిపై వెంకటేష్ కు నిపుణులు ఇలా చెప్పారు..

ఎప్పుడైనా ఏదైనా బ్యాంకు నుంచి తీసుకునే రుణానికి తప్పనిసరిగా ఆదాయపు రుజువు చూపించాల్సి ఉంటుంది . ఎందుకంటే మీరు రుణాన్ని ఎలా తిరిగి చెల్లిస్తారు అనేదానిని బ్యాంకులు కచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటాయి. ఇప్పుడు వెంకటేష్ లాంటి వ్యక్తుల విషయానికి వస్తే పర్సనల్ లోన్ ఇతనికి ఇవ్వడం విషయంలో బ్యాంకులు వెనుకంజ వేయడానికి కారణం అదే. అయితే, ఇటువంటి పరిస్థితిలో లోన్ కావాలంటే ఏదైనా కొలేటరల్ సెక్యూరిటీని చూపించడం ద్వారా లోన్ కోసం ప్రయత్నించవచ్చు. ఎందుకంటే, బ్యాంకులు ఒకవేళ వినియోగదారుని నుంచి లోన్ తిరిగి రాబట్టుకునే క్రమంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కుంటే తమ మూలధనాన్ని రక్షించుకోవడం కోసం ఈ విధానాన్ని అమలు చేస్తాయి. గ్యారెంటార్ గురించి కూడా అడుగుతారు. ఎదైనా డిఫాల్ట్ విషయంలో తమ సొమ్మును వారి నుంచి రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది.

బ్యాంక్ తన భద్రతను నిర్ధారించడానికి ఈ తనిఖీలన్నీ అనుసరిస్తాయి. అదే సమయంలో, కొత్తగా వచ్చే డిజిటల్ లెండింగ్ యాప్ ల నిర్వాహకులు మరింత సౌకర్యవంతమైన విధానాన్ని అందిస్తారు. కానీ వారు కూడా తమ మూలధనాన్ని సురక్షితంగా ఉంచడానికి తనిఖీలు, బ్యాలెన్స్‌లు ఉండేలా చూస్తారు.

ఇక రుణం పొందడానికి అవసరమైన ప్రాథమిక పత్రాలు పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డ్, ఆధార్ కార్డ్, యాక్టివ్ బ్యాంక్ ఖాతా వివరాలు అలాగే ఆదాయ రుజువు.

వెంకటేష్ విషయంలో, ఆదాయ రుజువు లేనందున.. ఏదో ఒక రకమైన హామీని అందించాల్సి ఉంటుంది. వెంకటేష్ ఈ విషయంలో అతని తల్లిదండ్రులను సహ రుణగ్రహీతగా చేయడం మంచిది . అప్పుడు వారు ఉమ్మడిగా బాధ్యత వహిస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాంకులు కూడా రుణ మంజూరు చేయడంలో వెనుకంజ వేయవు.

ఇక సిబిల్ స్కోర్ విషయానికి వస్తే.. రుణాలను సకాలంలో చెల్లించినట్లయితే, అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపదు.

ఇవి కూడా చదవండి: Kiran Abbavaram: ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యంగ్ హీరో..

Road Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు..

Omicron: ఒమిక్రాన్‌ కోసం ఔషధాన్ని తయారు చేసిన బ్రిటన్‌.. వివరాలు వెల్లడించిన పరిశోధకులు