AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. పూర్తి వివరాలు..!

Indian Railways: ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది మారిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది బీమా పాలసీలు చేసుకుంటున్నారు...

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. పూర్తి వివరాలు..!
Subhash Goud
|

Updated on: Dec 03, 2021 | 2:37 PM

Share

Indian Railways: ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది మారిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది బీమా పాలసీలు చేసుకుంటున్నారు. ఇన్సూరెన్స్‌ పాలసీలు కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది. సాధారణంగా హెల్త్‌ పాలసీలు చేసుకుంటారు. కానీ రైలు ప్రయాణంలో కూడా ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంది. పెద్దగా ఖర్చులేని పాలసీకి రూ.10 లక్షల వరకు అందుకునే సదుపాయం ఉంది. రైలు టికెట్లు కావాలంటే ఇంట్లో కూర్చుండే ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు. కానీ రైలు ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ ఉంటుందని చాలా మందికి తెలియదు.

ఇక రైలు ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే బీమా సదుపాయాన్ని కల్పి్స్తోంది. ఇక కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ సదుపాయాన్ని అందిస్తోంది. అయితే రైలు టికెట్‌ కొనుగోలు చేసేవారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంది. టికెట్‌ బుకింగ్‌ చేసే సమయంలో ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. రైలు ప్రమాదంలో జరిగిన ప్రయాణికులు మరణించినప్పుడు ఈ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. దీని వల్ల వారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ ఇన్సూరెన్స్‌ ఉపయోగపడుతుంది. ఆస్పత్రి ఖర్చులకు కూడా ఈ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది.

ఆస్పత్రిలో చికిత్సకు రూ.2 లక్షలు:

రైలు ప్రమాదంలో ప్రయాణికుడు గాయపడినట్లయితే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం రూ.2 లక్షల వరకు బీమా డబ్బులు వస్తాయి. శాశ్వత పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షల కవరేజీ, శాశ్వత వైకల్యం సంభవించినట్లయితే రూ.10 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఒక వేళ ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినా రూ.10 లక్షల బీమా రక్షణగా ఉంటుంది.

రైలు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే సమయంలో ఈ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేసి టిక్‌ మార్క్‌ పెట్టినట్లయితే సరిపోతుంది. ఇన్సూరెన్స్‌ పాలసీ పూర్తి వివరాలు మీ రిజిస్ట్రర్డ్‌ ఈమెయిల్‌ ఐడీకి వస్తాయి. అందుకు ఈ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అందుకే రైలు ప్రయాణం చేసే సమయంలో 35 పైసలతో 10 లక్షల రూపాయల విలువైన బీమా సదుపాయం పొందవచ్చు.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ప్రకారం ఎలాంటి వాటికి బీమా ఉంటుందంటే..

► శాశ్వత, పాక్షిక వైకల్యం ► ఆస్పత్రి ఖర్చులు ► ప్రయాణికుడు చనిపోవడం

దేనికి ఎంత బీమా వర్తిస్తుంది..?

► ఆస్పత్రిలో చేరేందుకు రూ.2 లక్షల కవరేజీ ► శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల బీమా ► మృతదేహాలను తరలించేందుకు రూ.10 వేల కవరేజీ ► రైలు ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత వైకల్యం చెందిన రూ.10 లక్షల కవరేజీ

ఇవి కూడా చదవండి:

Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రైళ్లను అద్దెకు ఇచ్చేందుకు ‘భారత్‌ గౌరవ్‌ స్కీమ్‌’

EPF Insurance: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారికి అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ ఫామ్‌ పూర్తి చేస్తే రూ.7 లక్షల బెనిఫిట్‌..!