Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. చిన్నవారైనా, పెద్దవారైనా....
మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. చిన్నవారైనా, పెద్దవారైనా.. తెలియని విషయాలను నేర్చుకోవడం అస్సలు తప్పు కాదు. ఎంత ఎక్కువగా నేర్చుకుంటే.. జీవితంలో అంత గొప్ప స్థాయికి ఎదుగుతాం. ఎందుకంటే నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రక్రియ. కొంతమంది చూసి నేర్చుకుంటే.. మరికొందరు ఎదుటివారి ఇన్‌స్పిరేషనల్ కథలను స్పూర్తి పొందుతారు.
అయితే ఇంకొందరు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఇలా నేర్చుకోవడం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ స్వంత అనుభవాలు మరోసారి మీరు తప్పటడుగు వేయకుండా ఆపుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మూడు రాశులవారు తమ తప్పుల నుంచి ఎంతగానో నేర్చుకుంటారట. తద్వారా సరైన మార్గాన్ని ఎంచుకుని విజయాలు సాధిస్తారట. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం…
1. వృషభరాశి:
ఈ రాశివారు మొండి పట్టుదలగల వ్యక్తులు. మీరు తప్పు చేస్తున్నారని ఇతరులు అంటే.. దాన్ని అస్సలు అంగీకరించరు. ఎప్పటికీ వారు చేసిందే కరెక్ట్. వారికే అన్ని తెలుసు అని ఎలప్పుడూ నమ్ముతారు. ఇక ఒక తప్పటడుగు.. వీరికి సరైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ రాశివారు ఎలప్పుడూ తెలివితక్కువగా చేసిన తప్పుల నుంచి పాఠాలు నేచుకుంటారు.
2. మిధునరాశి:
ఈ రాశివారు స్వతహాగా అనిశ్చితగా ఉంటారు. ఎల్లప్పుడూ అయోమయంలో పడుతుంటారు. సరైన మార్గాన్ని కనుగొనే వరకు వీరు కొత్త కొత్త విషయాలను ప్రయత్నిస్తారు. అందులో విఫలమైనా కూడా వారు ప్రయత్నాలను వదలరు. తప్పుల నుంచి నేర్చుకుంటూ సరైన మార్గంలోకి పయనిస్తారు.
3. మీనరాశి:
ప్రేమ విషయంలో ఈ రాశివారు ఎలప్పుడూ తప్పులు చేస్తుంటారు. తనకు కాబోయే భాగస్వామి ఇలా ఉండాలి.. అలా ఉండాలని కలలు కంటారు. తీరా అలా జరగకపోయేసరికి హార్ట్ అవుతారు. వీరి లవ్ లైఫ్ ఎప్పుడూ రోలర్-కోస్టర్ రైడ్ లాంటిది.
4. కర్కాటక రాశి:
ఈ రాశివారు ఇతరులు ఏం చేసినా క్షమించేస్టారు. అదే వారిని దుర్బలమైన స్థితిలో ఉంచుతుంది. బాధ నుంచి తమను తాము రక్షించుకోగలమని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అసలు జరిగింది తప్పో.. కాదో తెలుసుకోకుండా.. క్షమించడం.. మర్చిపోవడం వంటివి చేస్తారు. వాటి నుంచి ఎంతో నేర్చుకుంటారు.
5. మేషరాశి:
ఈ రాశివారు ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు.. అది సరైనదా.? కదా.? అనే విషయాలను పట్టించుకోరు. ఆ పనిలో పదేపదే విఫలమవుతుంటారు. తద్వారా అసలు తాము ఏం తప్పు చేశామన్నది తెలుసుకుంటారు. పాఠం నేర్చుకుంటారు. ఆ తర్వాత జీవితంలో ఎప్పుడూ ఆ తప్పు మళ్లీ చేయరు.
6. కుంభరాశి:
ఈ రాశివారు అహంకారులు. ఎదుటవారి మాటను అస్సలు వినరు. ఇతరులు మంచి సలహా ఇచ్చినా కూడా.. వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడాన్ని ఇష్టపడరు. అయితే అనూహ్యంగా వేసే తప్పటడుగుల నుంచి ఎంతో నేర్చుకుంటారు. తన తప్పును తెలుసుకుంటారు. సరైన మార్గాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఇవి కూడా చదవండి:
ఈ 3 రాశులవారు చాలా డేంజర్.. పగ పెంచుకున్నారో ఇక అంతే! ఏయే రాశులంటే.!
ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!
వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!