AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fenugreek Benefits: ఆ రెండు సమస్యలకు రామబాణం.. మెంతుల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలివే..

ప్రతి నలుగురిలో ఒకరు దీర్ఘకాలివ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో ఇవి సర్వ సాధారణంగా మారిపోయాయి. ఎక్కడి నుంచి ఎలా మన శరీరంపై ఇవి దాడి చేస్తున్నాయో తెలియదు కానీ షుగర్, అధిక బరువు అనేవి మనలో చాలా మందికి అతిపెద్ద సమస్యగా మారాయి. అయితే, ఇప్పటికే ఈ సమస్యల బారిన పడిన వారు లేదా హెల్తీ లైఫ్ స్టయిల్ మొదలు పెట్టాలనుకునే వారికి మెంతులు ఎంతో ఉపయోగపడతాయి. వీటి లాభాలేంటో తెలుసుకోండి.

Fenugreek Benefits: ఆ రెండు సమస్యలకు రామబాణం.. మెంతుల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలివే..
Fenu Greek Seeds Benefits
Bhavani
|

Updated on: Apr 07, 2025 | 5:10 PM

Share

మన ఇంటి వంటగదిలో దొరికే మెంతులు ఒక సాధారణ సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు – అవి ఆరోగ్యానికి ఒక వరం ఓ వరం. ఈ చిన్న గింజల్లో దాగిన అద్భుత లాభాలు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అవి మీ శరీరాన్ని ఎలా ఫిట్‌గా ఉంచడమే కాకుండా ఎన్నో రకాల పోషకాలను కూడా అందిస్తాయి. మీ రోజును మెంతులతో స్టార్ట్ చేస్తే మీకున్న దీర్ఘకాలిక వ్యాధులపై ఎంతో ప్రభావవంతంగా పనిచేయగలవు. మరి వీటిని ఎలా వాడాలో మీరే చూసేయండి.

మెంతులు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్

మెంతులు వంటలకు రుచిని జోడించడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గొప్పగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో ఉండే పీచు, ఆల్కలాయిడ్స్, ఇన్సులిన్‌ను ప్రేరేపించే 2-ఆక్సోగ్లుటేట్ అనే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అందుకే మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవాళ్లు లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవాళ్లు ప్రతిరోజూ మెంతులను తమ ఆహారంలో చేర్చుకుంటే షుగర్‌ను నియంత్రించవచ్చని అంటున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బృందం చేసిన ఒక పరిశోధనలో కూడా మెంతుల్లోని పోషకాలు ఔషధ గుణాలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి తోడ్పడతాయని తేలింది.

ఇలా తోడ్పడతాయి..

మెంతుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి. జీర్ణ సమస్యల నుంచి చక్కెర స్థాయిల వరకూ, చర్మ సౌందర్యం నుంచి జుట్టు ఒత్తుగా మారడం వరకూ – ఇవి అన్నింటికీ పనిచేస్తాయి. కానీ, వీటిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఫలితాలు రావు.

రోజూ మెంతులు తీసుకోవడం ఎలా?

మెంతి నీళ్లు.. రాత్రంతా మెంతి గింజలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగండి. జీర్ణశక్తి పెరుగుతుంది, బరువు తగ్గడానికి కూడా సాయం చేస్తుంది. గింజలను కూడా తినేయొచ్చు.

మెంతి పొడి.. కూరల్లో, చపాతీ పిండిలో మెంతి పొడి కలపండి. రుచితో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

మెంతి టీ.. మెంతి గింజలను నీటిలో వేసి మరిగించి, టీలా తాగండి. గొంతు నొప్పి, జలుబుకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

అందం కోసం మెంతులు

మెంతి గింజలను మెత్తగా రుబ్బి, పెరుగుతో కలిపి హెయిర్ మాస్క్‌లా వాడండి. జుట్టు రాలడం తగ్గి, సిల్కీగా మారుతుంది. మెంతి పొడిని నీళ్లతో కలిపి ఫేస్ మాస్క్‌గా వేస్తే మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

జాగ్రత్తలు మర్చిపోవద్దు

మెంతులు ఎక్కువగా తీసుకుంటే కొంతమందికి కడుపులో అసౌకర్యం కలగొచ్చు. మీ శరీర తత్త్వాన్ని బట్టి తక్కువ మొత్తంలో మొదలుపెట్టి, సర్దుకుంటూ వాడండి. గర్భిణీ స్త్రీలు, షుగర్ మందులు వాడేవారు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.