Health Tips: క్యాన్సర్, కిడ్నీ సమస్యలకు ఈ పండు దివ్యౌషధం.. రోజుకు ఒక్కటి తింటే చాలు..
మలై యాపిల్.. ఇది ఎన్నో ఔషధాలు కలిగిన పండు. శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగి ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. ఈ పండు తింటే కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి మెడిసిన్ అంటున్నారు నిపుణులు. అంతేకాదు కోలన్ క్యాన్సర్కు కూడా ఈ పండు నియంత్రిస్తుంది.

Malai Apple Benefits
- మలై యాపిల్.. ఇది ఎన్నో ఔషధాలు కలిగిన పండు. శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగి ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. ఈ పండు తింటే కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి మెడిసిన్ అంటున్నారు నిపుణులు.
- అంతేకాదు కోలన్ క్యాన్సర్కు కూడా ఈ పండు నియంత్రిస్తుంది. ఆయుర్వేద ఔషధాలలో దీనిని విరివిగ వాడుతారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడో హిమాలయాల్లో పెరిగే ఈ చెట్లు ఒక సీజన్లో మాత్రమే కాయలు కాస్తాయి.
- ఇప్పడు ఈ అరుదైన చెట్టు తెలంగాణలోని ఓ ఆయుర్వేద వైద్యురాలి ఇంటి పెరటిలో పెరిగి మంచి కాపు కాస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఆయుర్వేద వైద్యురాలు కొనకళ్ళ సుధా ఇంటి ఆవరణలో పెరిగి మలై యాపిల్ కాపు కాస్తుంది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పండు క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకుంటుంది
- అదేవిధంగా కిడ్నీ స్టోన్ సమస్యను తగ్గిస్తుందని తెలిపారు. అంతే కాకుండా చర్మ సౌందర్యానికి ఈ పండు మంచి చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యురాలు కొనకళ్ళ సుధా తెలిపారు.
- ఎక్కువగా శీతల ప్రాంతంలోనే పెరిగే మొక్క దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే సత్తుపల్లి ప్రాంతంలో పెరగడం మంచి కాపు కాయడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.