Excess Protein Side Effect: ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? గుండె పోటు, కిడ్నీ సమస్యలు ఇంకా..
శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కండరాల నిర్మాణానికి, బలాన్ని పెంపొందించడానికి, శరీర పోషణను నిర్వహించడానికి ప్రోటీన్ అవసరం. అందువల్ల రోజువారీ ఆహారంలో అగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అందుకు ఆహారంలో గుడ్లు, చేపలు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు చేర్చుకోవాలి. శరీర నిర్మాణానికి ప్రోటీన్ ఎంత అవసరమో, అదనపు ప్రోటీన్ కూడా అంతే ప్రమాదకరం. ఇటీవలి US అధ్యయనం ప్రకారం.. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల గుండెకు ప్రమాదం అని తేలింది..
Updated on: Feb 23, 2024 | 12:50 PM

శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కండరాల నిర్మాణానికి, బలాన్ని పెంపొందించడానికి, శరీర పోషణను నిర్వహించడానికి ప్రోటీన్ అవసరం. అందువల్ల రోజువారీ ఆహారంలో అగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అందుకు ఆహారంలో గుడ్లు, చేపలు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు చేర్చుకోవాలి. శరీర నిర్మాణానికి ప్రోటీన్ ఎంత అవసరమో, అదనపు ప్రోటీన్ కూడా అంతే ప్రమాదకరం. ఇటీవలి US అధ్యయనం ప్రకారం.. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల గుండెకు ప్రమాదం అని తేలింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అదనపు ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు గుండెకు అనుసంధానించబడిన ధమనుల లోపల ప్రోటీన్ నిక్షేపాలు పేరుకుపోతాయి. ఫలితంగా ధమనులలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇది స్ట్రోక్, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా మంది ఎక్కువ ప్రొటీన్ పొందడానికి రెడ్ మీట్ లేదా ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. కానీ శరీరంలో ప్రోటీన్ అధికంగా పెరిగిపోయి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

గుండెకే కాదు, శరీరంలో అదనపు ప్రొటీన్లు శరీర బరువును పెంచుతాయి. అదనపు ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అమైనో ఆమ్లాలు స్రవిస్తాయి. ఇవి కొవ్వుగా శరీరంలో నిల్వ చేయబడతాయి. దీనివల్ల శరీరంలో కొవ్వు, బరువు పెరుగుతాయి. అదనపు ప్రోటీన్ కాలేయాన్ని కూడా పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే వండిన ఆహారం తినడం ఫైబర్ లోపం ఏర్పడుతుంది. ఫైబర్ తక్కువగా ఉంటే మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకం సమస్యకు కూడా శరీరంలోని అదనపు ప్రోటీన్ కారణం అవుతుందన్నమాట.

అధిక ప్రోటీన్ మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఎక్కువగా ప్రొటీన్లు శరీరంలో పేరుకుపోతే కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. దీంతోపాటు జలుబు, తలనొప్పికి కూడా ప్రొటీన్ కారణమని తాజా పరిశోధన నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రోటీన్ లోపం వల్ల మైకం, బలహీనత సంభవిస్తుంది. అదేవిధంగా శరీరంలోని అదనపు ప్రొటీన్లు కూడా ఇటువంటి సమస్యలను కలిగిస్తాయి. మలబద్ధకం, తరచుగా పొడి దగ్గు వంటి సమస్యలు కూడా అధిక ప్రోటీన్ వల్ల సంభవించవచ్చు. కాబట్టి సిక్ ప్యాక్ లుక్ కోసం జిమ్ కు వెళ్లేవారు, ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకునే వారు డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు అవసరమైన మోతాదులో ప్రొటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.





























