బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో
రాత్రి వేళ చలి తీవ్రంగా ఉండటంతో బీహార్లోని చాప్రాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు రాత్రి వేళ బొగ్గుల కుంపటి వెలిగించారు. తలుపులు, కిటికీలు మూసేశారు. మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు గదిలో నిద్రించారు. కాసేపటికి వారంతా నిద్రలోకి జారుకున్నారు. అయితే.. ఆ బొగ్గుల కుంపటి మాత్రం సన్నగా మండుతూనే ఉంది. కాసేపటికి ఆ గదిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవటంతో ఆ గదిలో నిద్రించిన ఎనిమిది మంది స్పృహ కోల్పోయారు. శుక్రవారం తెల్లవారుజామున కింది అంతస్తులో నివసించే బంధువులు వారింటికి వెళ్లి అక్కడి వారిని చూసి ఆందోళన చెందారు.
వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే మూడేళ్ల తేజాంష్ కుమార్, ఏడు నెలల గుడియా కుమారి, ఆదియా కుమారి, 70 ఏళ్ల కమలావతి దేవి మరణినంచినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 25 ఏళ్ల ఆర్య కుమారి, 24 ఏళ్ల ఆర్య సింగ్, 25 ఏళ్ల అనిషా, 35 ఏళ్ల అమిత్ అలియాస్ సోనుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత బొగ్గుల కుంపటి ఉంచిన గదిని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాన్ని పంపి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
వైరల్ వీడియోలు
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

