కాన్పు తర్వాత కడుపునొప్పి.. స్కాన్ చేస్తే లోపలున్నది చూసి షాక్ వీడియో
వైద్యులను దైవంతో సమానంగా చూస్తారు. కానీ కొందరి నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. గ్రేటర్ నోయిడాలో ఒక మహిళకు ప్రసవం చేసిన సమయంలో ఆమె కడుపులోనే అరమీటరు పొడవున్న సర్జికల్ క్లాత్‌ను వదిలేసి కుట్లు వేశారు వైద్యులు. ఆ తప్పును గుర్తించకపోవడంతో 18 నెలల పాటు ఆ మహిళ నరకయాతన అనుభవించింది.
అన్షుల్ వర్మ ఇంట్లో కుట్టు పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 2023 నవంబర్ 14న తుగ్లక్‌పూర్‌లోని బాక్సన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. డాక్టర్ అంజనా అగర్వాల్ ఆమెకు సీ సెక్షన్ చేసి పురుడు పోశారు. అయితే ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్నా.. ఎవరూ అసలు కారణాన్ని కనిపెట్ట లేకపోయారు. నొప్పి భరించలేక ఏప్రిల్ 2025లో ఆమె గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిని ఆశ్రయించింది. అక్కడ వైద్యులు ఆమె కడుపులో ఏదో గుడ్డ లాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించి తక్షణమే సర్జరీ చేయాలని సూచించారు. ఆపరేషన్‌లో డాక్టర్లు కడుపులో ఏకంగా అరమీటర్ పొడవున్న సర్జికల్ గుడ్డ ముక్క ఉందని స్పష్టం చేశారు. 2023లో జరిగిన కాన్పు సమయంలోనే దీనిని డాక్టర్లు కడుపులో వదిలేసినట్లు తేలింది. ఈ రెండో సర్జరీ సమయంలో ఆమెకు ఏకంగా 8 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. భవిష్యత్తులో ఆమెకు మళ్లీ సంతానం కలిగే అవకాశం లేదని వైద్యులు చెప్పడం ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

