వంటగదిలో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే దరిద్రం మీ వెంటే.. వెంటనే ఇలా చేస్తే..
వంటగది ఇంటి ఆర్థిక, ఆరోగ్య శ్రేయస్సుకు కీలకం. వాస్తు ప్రకారం.. కొన్ని వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షించి, అప్పులు, అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఆ వస్తువులను కిచెన్‌లో అస్సలు ఉంచకూడదు. పరిశుభ్రమైన వంటగది లక్ష్మీ కటాక్షాన్ని, సానుకూలతను పెంచుతుంది. కిచెన్‌లో ఏం పెట్టొద్దు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి అభివృద్ధిలో వంటగది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. వంటగది కేవలం ఆహారం వండుకునే ప్రాంతం మాత్రమే కాదు, అది ఇంటి ఆర్థిక స్థితిని, శక్తి,ని, శ్రేయస్సును నిర్ణయించే కేంద్రం. అయితే చాలామంది తెలియక వంటగదిలో కొన్ని అనవసరమైన వస్తువులను ఉంచుతుంటారు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షించి, ఇంటి యజమానిని అప్పుల పాలు చేస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ వాస్తు నిపుణులు అనిష్ వ్యాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వంటగదిలో ఉండకూడని ఆ 4 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శుభ్రపరిచే పదార్థాలు
వంటగదిని హిందూ సంప్రదాయంలో దేవాలయంతో సమానంగా భావిస్తారు. అన్నపూర్ణ దేవి కొలువై ఉండే ఈ పవిత్ర స్థలంలో చీపుర్లు, తుడిచే బట్టలు లేదా డస్ట్ బిన్లను ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడి, ఇంట్లోని సానుకూలత తగ్గిపోతుంది.
మందులు
చాలా మంది సౌకర్యం కోసం వంటగదిలోనే మందుల డబ్బాలను ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం.. వంటగదిలో మందులు ఉంచడం అస్సలు మంచిది కాదు. ఇది ఇంట్లో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి బదులుగా మరింత పెంచుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది.
పాత వస్తువులు – ఖాళీ డబ్బాలు
వంటగదిలో పాత పేపర్లు, పనికిరాని బిల్లులు, చిరిగిన పత్రాలు ఉంచడం వల్ల అశుద్ధ శక్తి ప్రవాహం పెరుగుతుంది. అలాగే, ధాన్యాలు లేని ఖాళీ డబ్బాలను లేదా పాత్రలను అలమరాల్లో ఉంచడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏవైనా డబ్బాలు ఖాళీ అయితే వాటిని వెంటనే నింపడం లేదా బయట ఉంచడం శ్రేయస్కరం.
సింక్ కింద చెత్త
స్థలం ఆదా చేయడానికి చాలామంది వంటగది సింక్ కింద చెత్త డబ్బాను పెడుతుంటారు. కానీ సింక్ అనేది వరుణ దేవడికి ప్రతీక. నీటి ప్రవాహం ఉన్న చోట చెత్తను ఉంచడం వల్ల వరుణ దేవుడి ఆగ్రహానికి గురై, ఇంట్లో ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. మీ వంటగదిలో కూడా ఈ వస్తువులు ఉంటే, 2025 ముగిసేలోపు వాటిని తొలగించి శుభ్రం చేసుకోండి. వంటగది ఎంత పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంటే.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అంత ఎక్కువగా ఉంటుంది.
