Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్‌తో నటి పూనమ్ పాండే మృతి.. ఈ క్యాన్సర్ లక్షణాలు ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి
ప్రముఖ నటి పూనమ్ పాండే గురువారం రాత్రి (ఫిబ్రవరి 1) సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్)తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నటి మేనేజర్ ఈ రోజు ఇన్‌స్టా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గత కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. సాధారణంగా మహిళల్లో క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అందరూ గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) గుర్తొస్తుంది..
ప్రముఖ నటి పూనమ్ పాండే గురువారం రాత్రి (ఫిబ్రవరి 1) సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్)తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నటి మేనేజర్ ఈ రోజు ఇన్‌స్టా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గత కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె తాజాగా ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. సాధారణంగా మహిళల్లో క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ మాత్రమే అందరూ గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) గుర్తొస్తుంది. నిజానికి, ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మందికి గర్భాశయ ముఖ క్యాన్సర్ గురించి లోతైన అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రకమైన క్యాన్సర్ లక్షణాలు, నివారణ వంటి విషయాలు నిపుణుల మాటల్లో మీకోసం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను ప్రభావితం చేసే తీవ్రమైన ఆరోగ్య సమస్య గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. గర్భాశయంలో యోనికి దిగువన ఉండే భాగంలో అసహజ కణాల పెరుగుదల వల్ల ఇది సంభవిస్తుంది. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను ఆరంభంలోనే ముందుగా పసిగట్టడం ద్వారా చికిత్స అందించవచ్చు. లేదంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రారంభ దశలో ఒక్కోసారి ఎటువంటి సంకేతాలు కనిపించవు. నెమ్మదిగా ఈ మహమ్మారి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది.
- పీరియడ్స్ సమయంలో అధికంగా రక్తస్రావం కావడం
- మెనోపాజ్ తర్వాత, లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత రక్తస్రావం
- పొత్తి కడుపులో నొప్పి రావడం, లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు లేదా ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంట రావడం
- వెజైనల్ డిశ్చార్జి దుర్వాసన రావడం
- పదే పదే యూరిన్‌కి వెళ్లాల్సి రావడం, యూరిన్ సమయంలో నొప్పిగా అనిపించడం
- కడుపుబ్బరం, అలసట, నీరసం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే సర్వైకల్ క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. వీటిల్లో ఏవైనా లక్షణాలు గమనించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
ఎందుకు వస్తుంది?
గర్భాశయ క్యాన్సర్ బహుళ పరిస్థితుల ఫలితంగా అభివృద్ధి చెందుతుంది. ధూమపానం చేసే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ వ్యాధి సోకిన వారు ధూమపానం చేసే వేంగా ఆరోగ్యం క్షీణఙస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో కూడా ఈ క్యాన్సర్ వస్తుంది.హెచ్‌ఐవి/ఎయిడ్స్ వంటి వ్యాధులు, రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఔషధాల ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు HPV సంక్రమిచడం ద్వారా కూడా క్యాన్సర్ బారీన పడవచ్చు. ఒకే వ్యక్తి చాలా మంది లైంగిక భాగస్వాములు కలిగి ఉన్నా ఈ క్యాన్సర్ వస్తుంది. నోటి ద్వారా గర్భనిరోధకాలను ఎక్కువ కాలం వాడితే ప్రమాదం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
నివారణ మార్గాలు
గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన కారణం HPV ఇన్‌ఫెక్షన్. ప్రారంభ దశలోనే హెచ్‌పీవీ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అలాగే టీనేజర్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి ముందు ఈ టీకాలు వేయాలి. 21 ఏళ్లు దాటాక డాక్టర్ సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో పాప్ స్మియర్ టెస్టు చేయించుకోవాలి. 9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకుహెచ్‌పీవీ వ్యాక్సినేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ధూమపానం మానేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తరచుగా వ్యాయామం చేయడం, మంచి ఆరోగ్యాన్ని మెయింటెన్ చేయడం వల్ల.. ఇన్ఫెక్షన్ల హాని తగ్గించే బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరంలో నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాని ప్రభావాలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మెయింటెన్ చేయడం, టీకాలు చేయించుకోవడం, రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవడం అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.