Health Tips: శీతాకాలంలో టీ – కాఫీల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?
సాధారణంగా శీతలకాలంలో వేడి పానీయాలు తాగేందుకు చాలా మంది సుముఖత చూసిస్తారు. అందులో ముఖ్యంగా టీ లేదా కాఫీ అంటే పిచ్చెక్కి పోతారు. రోజులో కనీసం నాలుగైదు సార్లైనా తాగేందుకు ఇష్టపడతారు. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే అక్కడి ప్రకృతిని, ఆహ్లాదాన్ని అనుభూతి చెందేందుకు టీ తాగుతూ సేదతీరుతారు. అలాంటి ప్రదేశాలు మన భారతదేశంలో చాలానే ఉన్నాయి. హిమాలయాల మొదలు ఊటీ, అరకు వరకూ ఇవన్నీ చల్లగా ఉంటే ప్రదేశాలే.

Benefits Of Drinking Coffee And Tea
సాధారణంగా శీతలకాలంలో వేడి పానీయాలు తాగేందుకు చాలా మంది సుముఖత చూసిస్తారు. అందులో ముఖ్యంగా టీ లేదా కాఫీ అంటే పిచ్చెక్కి పోతారు. రోజులో కనీసం నాలుగైదు సార్లైనా తాగేందుకు ఇష్టపడతారు. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే అక్కడి ప్రకృతిని, ఆహ్లాదాన్ని అనుభూతి చెందేందుకు టీ తాగుతూ సేదతీరుతారు. అలాంటి ప్రదేశాలు మన భారతదేశంలో చాలానే ఉన్నాయి. హిమాలయాల మొదలు ఊటీ, అరకు వరకూ ఇవన్నీ చల్లగా ఉంటే ప్రదేశాలే. అక్కడి వాతావరణానికి ఎలాంటి వారైనా వేడి పానీయాలు తీసుకోకుండా ఉండలేరు. అయితే ఈ టీ/కాఫీల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
టీ / కాఫీల వల్ల కలిగే ప్రయోజనాలు..
- టీ లో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీనిని సేవించడం వల్ల మైండ్ రిలాక్స్ అయి మెదడులోని నరాలు ఉత్తేజానికి గురవుతాయి.
- ఉదయం లేచిన వెంటనే ఒక కప్పు కాఫీ లేదా టీ కడుపులో పడితే చాలు ఆ రోజంతా ఎంతో యాక్టివ్ గా పనిచేస్తారు.
- శీతాకాలం లేదా వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధికంగా ఉష్ణపానీయాలు స్వీకరిస్తూ ఉంటారు.
- తద్వారా జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు ధరిచేరవని చెబుతున్నారు నిపుణులు.
- ఆయుర్వేద మూలికలు టీ పొడిలో ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.
- ఫ్రీ మోషన్ జరగడమే కాకుండా, కడుపులోని వికారం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
- అల్లం టీ తీసుకుంటే అది విశ్రాంతిని, ప్రశాంతతను కలిగిస్తుంది.
- చలికాలంలో వేడి టీ తీసుకోవడం వల్ల శరీరం త్వరగా చల్లబడదు. పైగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
- వేడిగా గొంతు ద్వారా కడుపులోకి వెళ్లిన కాఫీ, టీ ఏదైనా ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది.
- బద్దకం, సోమరితనం, నిద్రను తమ నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




