AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura Egg Curry: డిఫరెంట్‌గా గోంగూర కోడిగుడ్డు కర్రీ.. వాటే టేస్ట్ అనాల్సిందే!

గోంగూరతో చేసే ఏ వంటలైనా చాలా రుచిగా ఉంటాయి. పుల్ల పుల్లగా.. కారం కారంగా భలేగా ఉంటాయి. గోంగూర పచ్చడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గోంగూరతో ఎన్నో రకాల నాన్ వెజ్ వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర మటన్, చికెన్, రొయ్యలు ఇలా చాలానే చేస్తారు. గోంగూరతో కలిపి ఇప్పుడు వెజ్ వంటలు కూడా తయారు చేస్తున్నారు. అలాగే గోంగూర కోడి గుడ్డు కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అలా ఈ కర్రీ వేసుకుని..

Gongura Egg Curry: డిఫరెంట్‌గా గోంగూర కోడిగుడ్డు కర్రీ.. వాటే టేస్ట్ అనాల్సిందే!
Gongura Egg Curry
Chinni Enni
| Edited By: |

Updated on: Feb 03, 2024 | 7:08 PM

Share

గోంగూరతో చేసే ఏ వంటలైనా చాలా రుచిగా ఉంటాయి. పుల్ల పుల్లగా.. కారం కారంగా భలేగా ఉంటాయి. గోంగూర పచ్చడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గోంగూరతో ఎన్నో రకాల నాన్ వెజ్ వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర మటన్, చికెన్, రొయ్యలు ఇలా చాలానే చేస్తారు. గోంగూరతో కలిపి ఇప్పుడు వెజ్ వంటలు కూడా తయారు చేస్తున్నారు. అలాగే గోంగూర కోడి గుడ్డు కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అలా ఈ కర్రీ వేసుకుని తింటే.. వాటే టేస్ట్ అనాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ కర్రీ తిన్నారంటే.. మళ్లీ ఇలాగే చేసుకుని తింటారు. డిఫెరెంట్‌గా భలేగా ఉంటుంది. మరింకెందుకు లేట్ ఈ గోంగూర గుడ్డు కర్రీని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోంగూర కోడిగుడ్డు కర్రీకి కావాల్సిన పదార్థాలు:

పుల్లని గోంగూర, గుడ్లు, ఆయిల్, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి, యాలకులు.

గోంగూర కోడిగుడ్డు కర్రీ తయారీ విధానం:

ముందుగా కోడి గుడ్లను ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోంగూర కూడా శుభ్రంగా కడిగి.. వేయించి పక్కన పెట్టాలి. గోంగూర చల్లారాక మిక్సీలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ పాన్ పెట్టుకోవాలి. అందులో మసాలా దినుసులు లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి, యాలకులు వేసి వేయించుకోవాలి. వీటిని చల్లారాక పౌడర్‌లా చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదే పాన్‌లో ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఉల్లి పాయ ముక్కలు కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. ఇది వేగాక ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వీటిని కూడా ఓ రెండు నిమిషాలు వేయించాక.. పొట్టు తీసి పెట్టుకున్న కోడి గుడ్లను కూడా వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఓ రెండు నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ నెక్ట్స్ గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా కలిపి.. ఓ రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కోడి గుడ్డు కర్రీ సిద్ధం.

Follow Us
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర!
మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే!
మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే!
"Huawei" నుంచి ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ ఫోన్ లాంచ్..!
ఆ రెండు రోజులు నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్
ఆ రెండు రోజులు నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్
పెద్ద స్థాయిలో ఉండాల్సిన వాడు.. చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బుల
పెద్ద స్థాయిలో ఉండాల్సిన వాడు.. చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బుల
ఫ్లై దుబాయ్ దాడిలో ట్విస్ట్.. భారత లింకుల కోసం ఎన్‌ఐఏ వేట!
ఫ్లై దుబాయ్ దాడిలో ట్విస్ట్.. భారత లింకుల కోసం ఎన్‌ఐఏ వేట!
7 ఏళ్ల నిరీక్షణకు తెరపడలేదు.. 80 పరుగుల వద్ద పడిక్కల్ అవుట్
7 ఏళ్ల నిరీక్షణకు తెరపడలేదు.. 80 పరుగుల వద్ద పడిక్కల్ అవుట్
ఉద్యోగం వచ్చిన వారానికే వెంటాడిన మృత్యువు
ఉద్యోగం వచ్చిన వారానికే వెంటాడిన మృత్యువు
‘భారత్‌ను చూసి నేర్చుకోండి’ ఫెడ్ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం
‘భారత్‌ను చూసి నేర్చుకోండి’ ఫెడ్ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం
కోట్లు పోసి ఇంటిని కొన్న హీరోయిన్.. కట్ చేస్తే తొమ్మిది రోజుల్లోన
కోట్లు పోసి ఇంటిని కొన్న హీరోయిన్.. కట్ చేస్తే తొమ్మిది రోజుల్లోన