AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది పండు కాదు.. పోషకాల పవర్ హౌస్.. డైలీ ఓ గ్లాసు జ్యూస్ తాగితే ఇక తిరుగుండదు..

పండ్లలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు... ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అలాంటి పండ్లను మోసంబి ఒకటి.. ఈ పండును డైలీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది పండు కాదు.. పోషకాల పవర్ హౌస్.. డైలీ ఓ గ్లాసు జ్యూస్ తాగితే ఇక తిరుగుండదు..
Mosambi Fruit
Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2024 | 2:10 PM

Share

ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పండ్లు మన ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తాయి.. వాస్తవానికి పండ్లలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు… ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అలాంటి పండ్లలో మోసంబి ఒకటి. దీనిని బత్తాయి – నారింజ అని కూడా అంటారు. అయితే.. నారింజకు భిన్నంగా మోసంబి పచ్చిగా.. తీపి-పుల్లని రుచితో ఉంటుంది.

మోసంబిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం వంటి శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. దీంతోపాటు మోసంబిని విటమిన్‌ సి పవర్‌ హౌస్‌ అని కూడా అంటారు.. అందుకే.. చాలామంది ఉదయాన్నే లేదా వీలు దొరికినప్పుడల్లా మోసంబి జ్యూస్ తాగుతుంటారు..

ఈ మోసంబిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని.. సహజ ద్రవాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఈ పండును డైలీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డైలీ ఓ గ్లాస్ మోసంబి జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

పోషకాల పవర్ హౌస్: విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ మంచి మొత్తంలో ఉంటాయి.. ఇవి మీ శరీరానికి మేలు చేస్తాయి.. మోసంబి వినియోగం వల్ల శరీరంలో అనేక పోషకాల లోపం ఉండదు.. దీంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది..

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: మోసాంబిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ, ఇతర వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మోసంబి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. మిమ్మల్ని తేలికగా, చురుకుగా ఉంచుతుంది.

బరువు తగ్గుతుంది: మోసంబి తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల.. ఇది పెరుగుతున్న బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.. ఎందుకంటే ఇది తక్కువ కేలరీల ఆహారం. ఇది పొట్ట, నడుము చుట్టూ కొవ్వును కరిగిస్తుంది.. ఫిట్‌నెస్‌పై ఆందోళనతో ఉన్నవారు మోసంబి జ్యూస్‌ను తప్పనిసరిగా తాగాలి.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: మోసంబి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఉద్రిక్తత, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో ఇది ఔషధం కంటే ఇది తక్కువ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి