సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన కూర. ఇది చూడడానికి కొంచెం కొత్తిమీరలా ఉంటుంది. సెలరీలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ కె, సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెలరీ జ్యూస్ తరచూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చని నిపుణులు అంటున్నారు.