- Telugu News Photo Gallery Vitamin deficiency: Do you feel extra cold? It can be because of this Vitamin Deficiency
Extreme Cold Sensitivity: ఇతరులకన్నా మీకు కాస్త చలి ఎక్కువగా ఉంటుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..
చలికాలంలో అందరికీ చలి ఎక్కువగానే ఉంటుంది. కానీ కొందరు మాత్రం అధిక చలిని అనుభవిస్తారు. బయటికి రావాలంటే గజగజ వణికిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక సతమతం అవుతుంటే మాత్రం.. మీరీ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..
Updated on: Nov 28, 2024 | 1:05 PM

చలికాలం మొదలైంది. ఈ కాలంలో చలితో బాధపడడం మామూలే. అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే మీరు అధికంగా చలితో వణుకుతున్నట్లయితే.. కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అది అధిక శీతోష్ణగ్రత వల్ల కాదని, మీ శరీరంలో ఈ పోషకాలు లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విటమిన్లు, కొన్ని పోషకాల కొరత కారణంగా ఇలా అధిక చలి సంభవిస్తుందట.

మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలలో ఐరన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి చాలా అవసరం.

అలాగే B12, ఫోలేట్, విటమిన్ సి వంటి కొన్ని విటమిన్లు కూడా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, ఆక్సిజన్ రవాణా చేయడంలో ఈ పోషకాలు కలిసి పనిచేస్తాయి.

ది లాన్సెట్ హెమటాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఐరన్ లోపం వల్ల అనీమియాతో బాధపడుతున్న వ్యక్తుల్లో ఆక్సిజన్ రవాణా సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ చలిని అనుభవిస్తారని పేర్కొంది. కాబట్టి మీకు ఇతరులకన్నా ఎక్కువగా చలిగా అనిపిస్తే, అది విటమిన్ బి12, ఫోలేట్, ఐరన్ లోపానికి సంకేతమని అర్ధం చేసుకోవాలి.




