Monsoon Health Tips: వర్షాకాలంలో దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

కోవిడ్ వైరస్ (Covid-19 virus) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వర్షాకాలం (monsoon) కూడా మొదలైంది. ఈ కాలంలో మనకు కొంత ఉల్లాసంగా ఉంటుంది కానీ.. సీజనల్ వ్యాధులు మనల్ని నిద్రపోకుండా వెంటాడుతుంటాయి.

Monsoon Health Tips: వర్షాకాలంలో దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Monsoon Health Tips
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 14, 2021 | 2:07 PM

కోవిడ్ వైరస్ (Covid-19 virus) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వర్షాకాలం (monsoon) కూడా మొదలైంది. ఈ కాలంలో మనకు కొంత ఉల్లాసంగా ఉంటుంది కానీ.. సీజనల్ వ్యాధులు మనల్ని నిద్రపోకుండా వెంటాడుతుంటాయి. ఈ కాలంలో సరైన పద్దతిలో నడుచుకోకుంటే ఇక పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతారు.

వర్షాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లను చుట్టుముట్టే అవకావం ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా.. ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ  తెలుసుకుందాం.

మీ ఇంటి శుభ్రంగా ఉంచండి(Showering twice a day)

వర్షాకాలంలో ఇంట్లో చాలా మట్టి వచ్చి చేరుతుంది. వర్షంతో వచ్చే తడితో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి. అవి అంటువ్యాధులను, ఇన్ఫెక్షన్లను మోసుకొస్తుంటాయి. జెర్మ్స్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఇంటి శుభ్రతతో దోమలు, ఇతర కీటకాల పెంపకాన్ని నివారించవచ్చు. ఇది వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా తగ్గిస్తుంది.

వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయండి – మనమందరం వర్షంలో తడిసి ఆనందిస్తుంటాం.. అందులోనూ చిన్నారు మరింత ఉత్సాహం చూపిస్తుంటారు. వర్షంలో తడిసిన తరువాత తప్పకుండా స్నానం చేయాలి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబును నివారించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి.

హైడ్రేట్‌గా ఉండండి – ఈ సమయంలో తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో రోడ్‌సైడ్ వాటర్ కియోస్క్‌లు, ధాబాస్ లేదా షాపుల నుంచి వడకట్టని నీటిని తాగకండి. మీ ఇంట్లోని వాటర్ ప్యూరిఫైయర్ నుంచి మాత్రమే నీరు తాగండి. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. వెంటిలేషన్ కోసం  –

మనం ఎక్కువ సమయం గడిపే స్థలం కూడా వర్షాకాలంలో ప్రభావితం చేస్తుంది. ఇరుకైన ప్రదేశంలో ఉంటే అంటు వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతుంటాయి. వీలైనప్పుడల్లా ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి.

క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి –

వాష్‌రూమ్ డోర్, ట్యాప్, ఫ్లష్ మొదలైన వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన చేతుల్లోకి వస్తాయి. మీరు  భోజనానికి ముందు ఆ తరువాత తప్పనిసరిగా సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇది అంటువ్యాధులను నివారించడానికి మీకు సహాయపడుతుంది.

సూప్ తాగండి(Homemade fruit juices) –

వర్షాకాలంలో కొంత వెచ్చని సూప్ తాగడం చాలా బాగుంటుంది. చికెన్ సూప్ నుంచి క్యారెట్ సూప్, మష్రూమ్ సూప్ లేదా వెజిటబుల్ సూప్ మొదలైన అనేక సూప్‌లను తీసుకోవచ్చు. అంతేకాదు తులసి, పసుపు, దాల్చినచెక్క, ఏలకులతోపాటు నిమ్మకాయ వంటి ఇతర రోగనిరోధక శక్తిని పెంచే టీ (చాయ్)లను తీసుకోవచ్చు.

చల్లని డ్రింక్స్ తాగడం మానుకోండి –

చల్లని డ్రింక్స్ తాగడం మానుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అన్ని సమయాలలో తినండి. మీకు ఆరోగ్యంగా అనిపిస్తే ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.

ఇవి కూడా చదవండి : AP IPS officers: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Bride Viral Video: కారు బానట్‌పై పెళ్లి కూతురు.. సరదాగా తీసుకున్న వీడియో చిక్కుల్లో పడేసింది..