Bride Viral Video: కారు బానట్‌పై పెళ్లి కూతురు.. సరదాగా తీసుకున్న వీడియో చిక్కుల్లో పడేసింది..

కారు బానెట్‌పై ఎక్కి మంటపానికి వెళుతున్న దృశ్యాలు నెట్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అది పోలీసుల దృష్టికి వెళ్లింది. కారుపై స్టంట్స్ చేసిన పెళ్లి కూతురిపై...

Bride Viral Video: కారు బానట్‌పై పెళ్లి కూతురు.. సరదాగా తీసుకున్న వీడియో చిక్కుల్లో పడేసింది..
Bride Sits On Car Bonnet
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 14, 2021 | 12:33 PM

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తే.. వారు చేసే పని చట్టానికి పట్టిస్తుంటాయి. కారు బానెట్‌పై కూర్చుని మంటపానికి వెళుతున్న దృశ్యాలు నెట్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అది పోలీసుల దృష్టికి వెళ్లింది. కారుపై స్టంట్స్ చేసిన పెళ్లి కూతురిపై కేసు పెట్టాల్సి వచ్చింది. వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. చివరి వరకు గుర్తుండే మధురమైన జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఘనంగా జరుపుకోవాలని అందరూ భావిస్తుంటారు. అప్పు చేసైనా సరే.. ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా  వైభవంగా జరుపుకుంటారు.

పెళ్లి పత్రికల ప్రింటింగ్ మొదలు.. బరాత్ వరకు అన్ని కార్యక్రమాలూ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అందరి కంటే భిన్నంగా.. నలుగురూ మాట్లాడుకునేలా.. వెరైటీగా ఆలోచిస్తారు. ప్రీవెడ్డింగ్ షూటింగ్‌, మ్యారేజ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లో తమ పెళ్లి క్షణాలను కెమెరాల్లో బంధించి జీవితాంతం భద్రపరుచుకుంటారు. ఇక ఒకప్పుడు వధువు కనీసం తలపైకెత్తి చూసేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బరాత్‌లో పెళ్లి కూతుళ్లు కూడా తీన్మార్ డాన్స్‌లతో సందడి చేస్తున్నారు.

అయితే మహారాష్ట్రలో ఓ వధువు చేసిన ఈ పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా వధూవరులు కారులో మంటపానికి వస్తారు. ఆమె కూడా కారులోనే వచ్చింది. కానీ కారు లోపల కూర్చొని కాదు.. బానెట్‌పై కూర్చొని మంటపానికి విచ్చేసింది. అదే పెద్ద సమస్యగా మారింది.

పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన శుభాంగి జరాదే అనే యువతి వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. సాస్వద్‌లోని సిద్దేశ్వర ఫంక్షన్ హాల్‌లో వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఐతే పెళ్లి మంటపానికి వస్తున్న సమయంలో పెళ్లి కూతురు తన ఆనందాన్ని పట్టలేకపోయింది. స్కార్పియో కారు లోపలి నుంచి దిగి.. ఏకంగా బానెట్‌పై కూర్చుంది.

అలా ఘాట్ రోడ్లలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ… పెళ్లి మంటపానికి చేరుకుంది. కారు బానెట్‌పై కూర్చున్నా..వద్దని కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ ఎవరూ వారించలేదు. పైగా ఫొటోలు తీసుకున్నారు. ఆమెను చూసి రోడ్డుపై వెళ్తున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు పెళ్లి కుమారుడి తరపు వారు కూడా షాక్ తిన్నారు.

ఇవి కూడా చదవండి : Viral Video: కుందేలును వెంటాడి నోట పట్టిన చిరుత.. ఇంతలో ఆపద్బాంధవుడిలా వచ్చిన అడవి పంది

హిజ్ బుల్ ముజాహిదీన్ ఫౌండర్ సయ్యద్ సలాఉద్దీన్ కొడుకులు ‘స్యుడో టెర్రరిస్టులే’ ! ప్రభుత్వ వర్గాలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!