AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Products: సంపూర్ణ ఆరోగ్యానికి పాలు, నెయ్యి, వెన్న ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసా?

మనలో చాలా మంది పాల ఉత్పత్తులు తినడానికి ఇష్టపడరు. కానీ చీజ్ తో పిజ్జా తినడానికి ఇష్టపడతాడు. పిజ్జాతో చీజ్‌ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ రోజు వారీ ఆహారంలో పాలు, తక్కవ మొత్తంలో జున్ను వంటి పాల ఉత్పత్తులు తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పాలు పోషకాల గని చాలామందికి తెలుసు. ఈ సూపర్ ఫుడ్ నుంచి జున్ను, పెరుగు, లస్సీ, నెయ్యి, వెన్న వంటి ఆహారాన్ని తయారు చేస్తారు..

Milk Products: సంపూర్ణ ఆరోగ్యానికి పాలు, నెయ్యి, వెన్న ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసా?
Milk Products
Srilakshmi C
|

Updated on: Mar 22, 2024 | 1:54 PM

Share

మనలో చాలా మంది పాల ఉత్పత్తులు తినడానికి ఇష్టపడరు. కానీ చీజ్ తో పిజ్జా తినడానికి ఇష్టపడతాడు. పిజ్జాతో చీజ్‌ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ రోజు వారీ ఆహారంలో పాలు, తక్కవ మొత్తంలో జున్ను వంటి పాల ఉత్పత్తులు తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పాలు పోషకాల గని చాలామందికి తెలుసు. ఈ సూపర్ ఫుడ్ నుంచి జున్ను, పెరుగు, లస్సీ, నెయ్యి, వెన్న వంటి ఆహారాన్ని తయారు చేస్తారు. కానీ నెయ్యి-వెన్న, జున్ను ఎక్కువగా తినడం ప్రమాదకరం. అందుకే ఏ ఆహారం తింటే ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకోవాలి. అప్పుడే ఆహారం సమతుల్యంగా ఉంటుంది.

పాలు

అధిక మొత్తంలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి పాలలో ఉంటాయి. ఈ పానీయంలో ఫాస్ఫేట్, పొటాషియం కూడా ఉంటాయి. టీ, కాఫీలలో పాలు కలపడడానికి బదులు.. పాలల్లో పసుపు పొడి కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ కొవ్వు పాలు తాగేందుకు ప్రయత్నించాలి.

చీజ్

చీజ్‌లో ప్రొటీన్, క్యాల్షియం ఉంటాయి. చీజ్‌లో విటమిన్ ఎ, బి12, జింక్ కూడా ఉన్నాయి. ఇంట్లో తయారుచేసిన పిజ్జా, పాస్తా, శాండ్‌విచ్‌లు వంటి ఆహారాలలో చీజ్ కలపవచ్చు.

ఇవి కూడా చదవండి

పెరుగు

క్యాల్షియం, ప్రొటీన్‌లతో పాటు పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఈ ఆహారం పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పుల్లటి పెరుగు జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. ఓట్స్, పండ్లను పుల్లని పెరుగుతో కలిపి తినవచ్చు. లేదా స్మూతీ తయారు చేసి తినవచ్చు. కానీ అందులో చక్కెర జోడించకూడదు.

నెయ్యి

నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యిలో అధిక మొత్తంలో కొవ్వు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. ఆహారంలో కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు.

వెన్న

వెన్నలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. సంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి తక్కువ మోతాదులో వెన్న తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వంటల్లో వెన్న, నెయ్యిని ఉపయోగించవచ్చు.

ఆహారంలో పాల ఉత్పత్తులను వినియోగించడం వల్ల కలిగే అదన ప్రయోజనాలు…

  • పాలు, పాల ఉత్పత్తులు ఎముకల ఆరోగ్యాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అవి బలమైన, దృఢమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడతాయి.
  • పండ్లు, కూరగాయలతో పాటు పాల ఉత్పత్తులను కూడా తప్పరిసరిగా తీసుకోవాలి. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.
  • పేగుల ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్ అవసరం. పుల్లని పెరుగు నుంచి పోషకాహారం లభిస్తుంది. పుల్లటి పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు