AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Detoxify Drinks: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా? ఈ సూపర్ డ్రింక్స్‌ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే..

ఇంటి ఆహారానికి బదులు.. బయటి ఆహారానికి అలవాటు పడడం వల్ల నేటికాలంలో అధిక మంది యువతలో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. శరీరంలోని టాక్సిన్లును క్లీన్ చేయడంలో కాలేయం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఏదైనా కారణంతో కాలేయం పనితీరులో ఆటంకం ఏర్పడిడే.. శరీరంలోని మిగిలిన విధులన్నీ దెబ్బతింటాయి. ఫ్యాటీ లివర్ సమస్యలను నివారించడానికి కాలేయాన్ని నిర్విషీకరణ చేయడం చాలా అవసరం..

Liver Detoxify Drinks: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా? ఈ సూపర్ డ్రింక్స్‌ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే..
Liver Detoxify Drinks
Srilakshmi C
|

Updated on: May 17, 2024 | 12:22 PM

Share

ఇంటి ఆహారానికి బదులు.. బయటి ఆహారానికి అలవాటు పడడం వల్ల నేటికాలంలో అధిక మంది యువతలో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. శరీరంలోని టాక్సిన్లును క్లీన్ చేయడంలో కాలేయం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఏదైనా కారణంతో కాలేయం పనితీరులో ఆటంకం ఏర్పడిడే.. శరీరంలోని మిగిలిన విధులన్నీ దెబ్బతింటాయి. ఫ్యాటీ లివర్ సమస్యలను నివారించడానికి కాలేయాన్ని నిర్విషీకరణ చేయడం చాలా అవసరం. లేదంటే ఇది కామెర్లు, హెపటైటిస్, కాలేయ వైఫల్యం, కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపడానికి ఈ కింది హోమ్‌ రెమెడీస్‌ ప్రభావవంతంగా పనిచేస్తాయి.

నిమ్మ రసం- పసుపు కలిసిన నీరు

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిమ్మరసంలోని విటమిన్ సి కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఒక గ్లాసుడు నీటిని వేడి చేసి, అందులో నిమ్మరసం, పసుపు పొడి మిక్స్ చేసి తాగాలి. రోజూ ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు పోతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

పసుపు – మెంతి నీరు

పసుపు – మెంతులు రెండింటికీ శరీరాన్ని నిర్విషీకరణ చేయగల సామర్థ్యం అధికంగా ఉంటుంది. అర టీస్పూన్ మెంతి గింజలు, చిటికెడు పసుపును ఒక గ్లాసుడు నీటిలో వేసి మరిగించాలి. తర్వాత చల్లార్చి ఆ నీటిని తాగాలి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను దూర చేస్తుంది. దీంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. బరువు కూడా సులువుగా తగ్గొచ్చు.

ఇవి కూడా చదవండి

అల్లం టీ

శరీరాన్ని రోగాల బారిన పడకుండా ఉంచేందుకు అల్లం ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ అల్లం రసం తీసుకోవడం వల్ల కాలేయ నిర్విషీకరణకు సహాయపడుతుంది. అల్లం టీని కూడా తాగవచ్చు. ఒక కప్పు నీటిలో అల్లం వేసి మరిగించాలి. అందులో కాస్తింత నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తాగాలి. ఈ డ్రింక్ అజీర్ణం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

వెల్లుల్లి

రోజువారీ ఆహారంలో ఒక వెల్లుల్లి రెబ్బను తప్పక తీసుకోవాలి. వెల్లుల్లి కాలేయ ఎంజైమ్‌లను సక్రియం చేయడం ద్వారా శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వెల్లుల్లి తింటే కూడా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు.

గోరింటాకు రసం

చాలా మంది బరువు తగ్గడానికి గోరింటాకు రసాన్ని తాగుతుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. గోరింటాకు రసం కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను కూడా బయటకు పంపుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరింటాకు రసం తాగితే ఫ్యాటీ లివర్ సమస్య దూరం అవుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..