AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పేదింటి బిడ్డకు ఖరీదైన జబ్బు.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..

ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆరు నెలల చిన్నారిని కాపాడేందుకు ఆ తల్లిదండ్రులు తమకున్నదంతా దారపోశారు. నూరు కోట్ల మంది దేవుళ్లకు మొక్కుకున్నారు. దాతల ద్వారా చిన్నారి చికిత్స కోసం రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. దీంతో వారి ఆశల దీపం వారిని వదిలి వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో..

Hyderabad: పేదింటి బిడ్డకు ఖరీదైన జబ్బు.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
6 Month Old Baby Died At Banjara Hills
Srilakshmi C
|

Updated on: May 17, 2024 | 8:40 AM

Share

వలిగొండ, మే 17: ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆరు నెలల చిన్నారిని కాపాడేందుకు ఆ తల్లిదండ్రులు తమకున్నదంతా దారపోశారు. నూరు కోట్ల మంది దేవుళ్లకు మొక్కుకున్నారు. దాతల ద్వారా చిన్నారి చికిత్స కోసం రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. దీంతో వారి ఆశల దీపం వారిని వదిలి వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో చోటు చేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల మదిర గ్రామం గోలిగూడేనికి చెందిన కొలను దిలీప్‌రెడ్డి, యామిని దంపతులకు ఆరు నెలల కుమారుడు భవిక్‌రెడ్డి ఉన్నాడు. పొట్ట కూటికోసం హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కి వచ్చిన దిలీప్‌రెడ్డి కుటుంబం.. అక్కడే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే తమ కుమారుడు భవిక్‌రెడ్డి జన్మించిన మూడో నెల నుంచి శరీర కదలికలు సరిగా ఉండేవికాదు. దీంతో వారు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి చిన్నారి స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ అనే అరుదైన టైప్‌-1 హైరిస్క్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు.

ఇది ఓ రకమైన నరాల కండరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి. దీనిని నయం చేయడానికి ఇంజెక్షన్‌ ఒక్కటే మార్గమని, అది అమెరికాలో మాత్రమే లభిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే ఆ ఇంజక్షన్‌ ఖరీదు రూ.16 కోట్టు ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా దిలీప్‌రెడ్డి, యామిని దంపతుల గుండె పగిలింది. మధ్యతరగతి కుటుంబస్తులైన వీరు అన్ని కోట్లు ఎక్కడి నుంచి తేవాలో తెలియక కుప్పకూలి పోయారు. దీంతో చేసేదిలేక కుమారుడి వైద్యం కోసం దిలీప్‌రెడ్డి దాతల సహకారం కోరారు.

ఇవి కూడా చదవండి

అలా క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఓ ఫార్మా కంపెనీ రూ.10 కోట్లు సమకూర్చింది. మిగిలిన ఆరు కోట్ల రూపాయలు సమయానికి సమకూరలేదు. దీంతో వేళకు ఇంజెక్షన్‌ను తెప్పించలేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవిక్‌రెడ్డి పరిస్థితి మరింత విషమించింది. ఈ క్రమంలో చిన్నారి గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు చూసి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.