TSRTC Driver cum Conductor Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో 2 వేల డ్రైవర్‌ కమ్‌ కండక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల!

తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంది. రేవంత్‌ సర్కార్‌ తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో నిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ప్రస్తుతం 2 వేల డ్రైవర్‌ పోస్టులతోపాటు, మరికొన్ని కండక్టర్‌ పోస్టులు కూడా..

TSRTC Driver cum Conductor Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో 2 వేల డ్రైవర్‌ కమ్‌ కండక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల!
TSRTC
Follow us

|

Updated on: May 16, 2024 | 11:30 AM

హైదరాబాద్‌, మే 16: తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంది. రేవంత్‌ సర్కార్‌ తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో నిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ప్రస్తుతం 2 వేల డ్రైవర్‌ పోస్టులతోపాటు, మరికొన్ని కండక్టర్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా నిత్యం బస్సుల రాకపోకలకు అధికారులు సతమతం అవుతున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్టీసీ ఓ నిర్ణయానికి వచ్చింది. వీలైనంత త్వరగా సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ మేరకు డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టులను విడివిడిగాకాకుండా.. డ్రైవర్‌ కమ్‌ కండక్టర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

అయితే ఈ పోస్టుల ద్వారా తీసుకున్న ఉద్యోగులను జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే సర్వీసుల్లో డ్రైవర్‌, కండక్టర్‌ డ్యూటీ ఒకరే చేసేలా నియామకాలు చేపట్టనున్నట్టు సమాచారం. అంటే డ్రైవర్‌ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి కండక్టర్‌ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మేరకు ఆర్టీసీ నిబంధనలను రూపొందిస్తుంది. దీనిపై సంస్థ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తద్వారా ఖర్చు కూడా తగ్గుతుందనే భావన అధికారుల్లో బలంగా ఏర్పడటంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

అలాగే హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థల సమయపాలన ఒకేలా ఉండేలా మార్చాలని కోరుతూ ఆర్టీసీ ఆయా విద్యాసంస్థలకు లేఖలు రాసింది. అందుకు అనుగుణంగా 1500 బస్సులను కాలేజీలు, విద్యాసంస్థల సమయాల్లో నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.