AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆకాశంలో అద్భుతం.. అమ్మమ్మ కోసం ఏకంగా స్వర్గానికి నిచ్చెన వేశాడుగా! వీడియో వైరల్

ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎలా ఉంటుంది.. ఊహ బాగానే ఉంది! వేయడం ఎలా? అని ఆలోచిస్తున్నారా? మనిషి తల్చుకుంటే సాధ్యం కానిదంటూ ఉంటుందా.. నేటి కంప్యూటర్‌ యుగంలో ప్రతిదీ సాధ్యమేనని రుజువు చేశాడో ఆర్టిస్ట్‌. ఆకాశానికి కాదు.. ఏకంగా స్వర్గాన్ని టార్గెట్‌ చేశాడు. ఇకేం.. అనుకున్నదే తడవుగా స్వర్గానికి నిచ్చెన వేసేశాడు. అయితే దానిని మనం ఎక్కలేం.. ఎందుకంటే అది నిప్పున నిచ్చెన మరి. అదేంటీ ? అనుకుంటున్నారా...

Viral Video: ఆకాశంలో అద్భుతం.. అమ్మమ్మ కోసం ఏకంగా స్వర్గానికి నిచ్చెన వేశాడుగా! వీడియో వైరల్
Stairway To Heaven
Srilakshmi C
|

Updated on: May 15, 2024 | 11:48 AM

Share

ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎలా ఉంటుంది.. ఊహ బాగానే ఉంది! వేయడం ఎలా? అని ఆలోచిస్తున్నారా? మనిషి తల్చుకుంటే సాధ్యం కానిదంటూ ఉంటుందా.. నేటి కంప్యూటర్‌ యుగంలో ప్రతిదీ సాధ్యమేనని రుజువు చేశాడో ఆర్టిస్ట్‌. ఆకాశానికి కాదు.. ఏకంగా స్వర్గాన్ని టార్గెట్‌ చేశాడు. ఇకేం.. అనుకున్నదే తడవుగా స్వర్గానికి నిచ్చెన వేసేశాడు. అయితే దానిని మనం ఎక్కలేం.. ఎందుకంటే అది నిప్పున నిచ్చెన మరి. అదేంటీ ? అనుకుంటున్నారా.. అవును! ఇతను ఆకాశానికి నిప్పుల నిచ్చెన వేశాడు. ఇదేదో చందమామ కథో.. భేతాళ కథో.. అనుకునేరు! నిజంగానే ఇలలో జరిగిన సంఘటన. నమ్మశక్యం కాకపోతే ఇదిగో .. ఈ వీడియో చూసేయండి!

చైనాకు చెందిన ‘కాయ్‌ గువో-కియాంగ్’ అనే ఆర్టిస్ట్‌ ఆకాశంలో ఈ అద్భుతం సృష్టించాడు. నిప్పులు కక్కుకుంటూ ఆకాశానికి ఎగబాకుతున్న నిచ్చెన తయారు చేసి యావత్‌ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఈ వీడియోలో ఆకాశంవైపు నిప్పులతో దూసుకుపోతున్న నిచ్చెన చూడొచ్చు. స్వర్గానికి మెట్ల మార్గం అనే క్యాప్షన్‌తో ‘అరోరా బొరియాలిస్’ అనే చైనా ఆర్టిస్ట్‌ దీనిని సృష్టించాడని జొనితా బ్రాడ్‌డ్రిక్‌ అనే యూజర్‌ ఎక్స్‌ ఖాతాలో ఈ వీడియో షేర్‌ చేసింది. అసలింతకీ స్వర్గానికి ఈ నిచ్చెన ఎందుకు వేశాడనే డౌట్‌ మీకూ వచ్చిందా? అసలు విషయం ఏమిటంటే.. ఇదంతా తన అమ్మమ్మ కోసం చేశాడట. నిజానికి ఈ వీడియో పదేళ నాటిది. చైనీస్ బాణసంచా ఆర్టిస్ట్‌ కాయ్‌ గువో-కియాంగ్ దీన్ని రూపొందించారు.

ఇవి కూడా చదవండి

ఆకాశంలోకి సుమారు అర కిలోమీటరు (1,650 అడుగుల ఎత్తు అంటే 502 మీటర్లు) ఎత్తు వరకు టపాసులను పేల్చుతూ రూపొందించాడు. రాగి తీగలో లోడ్ చేసిన గన్‌పౌడర్‌తో ఈ స్కై ల్యాడర్‌ను రూపొందించాడట. నిజానికి గువో-కియాంగ్‌కు ఇది మూడో ప్రయత్నమట. 1994లో బలమైన గాలులు వీయడంతో తన ప్రయోగం విఫలం అయ్యింది. ఆ తర్వాత 2001లో ట్రై చేయగా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్ర దాడుల నేపథ్యంలో షాంఘైలోని అధికారులు అతనికి అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత పదేళ్ల కిందట మూడోమారు అతని ప్రయత్నం ఫలించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తుఫానుగా మారింది. వ్యూస్‌, లైకులు, కామెంట్లతో తెగ వైరల్‌ అవుతోంది. ఈ అర్టిస్ట్‌ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా కాయ్ 1957లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాన్‌జౌ నగరంలో జన్మించారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.