CBSE 12th Results 2024: ‘జేఈఈ క్లియర్.. కానీ ఇంటర్‌లో ఫెయిల్!’ మనస్తాపంతో విద్యార్ధి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. నిన్న వచ్చిన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించాడు. ఎంతో కఠినమైన జేఈఈ మెయిన్ పరీక్షలో సత్తా చాటినా.. ఇంటర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినందుకు ఈ ఘోర నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకెళ్తే..
లక్నో, మే 14: ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. నిన్న వచ్చిన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించాడు. ఎంతో కఠినమైన జేఈఈ మెయిన్ పరీక్షలో సత్తా చాటినా.. ఇంటర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినందుకు ఈ ఘోర నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన ప్రదీప్ కుమార్.. శ్రీవాస్తవ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతని కుమారుడు ఓజస్వి (19) గోరఖ్‌నాథ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. 12వ తరగతి పరీక్షల అనంతరం ఢిల్లీలో ఓ పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉంటూ జేఈఈకి సిద్ధమవుతున్నాడు. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్ క్లియర్ చేసిన ఓజస్వి.. అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం వచ్చిన CBSE ఫలితాల్లో ఓజస్వీకి తక్కువ మార్కులు వచ్చాయి. పైగా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓజస్వి నిన్న సాయంత్రం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించాడు. తోటి స్నేహితులు పలుమార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో గదికి వచ్చి తలుపు తట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఓజస్వి గదిలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేను నా చదువులో ఏ స్టేజ్‌ను వదిలిపెట్టలేదు. JEE పరీక్ష క్లియర్ అయినప్పటికీ ఇంటర్‌లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఇంటర్‌లో నా మార్కుల గురించి ఎవరికైనా ఎలా చెప్పగలను. అందరూ నన్ను అవమానిస్తారు. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నా మరణం వల్ల మీరందరూ బాధపడతారు. కాగా బాలుడి తల్లిదండ్రులకు ఓజస్వి ఒక్కడే కుమారుడు. కూతురు ప్రగ్యా చెన్నైలో ఎంసీఏ చదువుతోంది. బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటో దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.