PM Modi Nomination: హ్యాట్రిక్‌పై గురి.. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. లైవ్
PM Modi Nomination Live: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు.. ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేసి హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్ నుంచి నమోఘాట్‌కు చేరుకుని మోదీ పూజలు చేశారు.
PM Modi Nomination Live: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు.. ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేసి హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్ నుంచి నమోఘాట్‌కు చేరుకుని మోదీ పూజలు చేశారు. అనంతరం అక్కడినుంచి కాలభైరవ ఆలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. అక్కడి నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.
కాగా.. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ భారీ ఏర్పాట్లు చేశారు. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
వారణాసిలో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం వారణాసిలో ఐదు కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన రోడ్‌షో ఇప్పుడు తన జీవితంలో మరచిపోలేని ఘట్టంగా నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..