ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్కా.. మోదీ ప్రధాని అవడం ఖాయం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కాసేపటి క్రితం వారణాసి చేరుకున్న ఆయన.. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం అన్నారు. ఏపీలో సార్వతిక ఎన్నికలు మే 13న ముగియడంతో ప్రస్తుతం మోదీకి మద్దతుగా నిలిచారు చంద్రబాబు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కాసేపటి క్రితం వారణాసి చేరుకున్న ఆయన.. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయం అన్నారు. ఏపీలో సార్వతిక ఎన్నికలు మే 13న ముగియడంతో ప్రస్తుతం మోదీకి మద్దతుగా నిలిచారు చంద్రబాబు. ఈరోజు ప్రధాని మోదీ వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఈయన నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు. దీంతో పాటూ ఏపీలో జరిగిన పోలింగ్ సరళిపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ క్రమంలోనే ఓ మీడియా ఇంటర్వూలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తాం అన్నారు. పోలింగ్ సరళి బాగా జరిగిందని పేర్కొన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే ప్రభుత్వంమే అని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు కేంద్రంలో ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్కాగా వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ సత్తా చాటుతుందని చెప్పారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కొనసాగుతారని జోస్యం చెప్పారు. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే మోదీని కలవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేవలం నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం కోసమే వెళ్లారా లేక ఏపీ రాజకీయాలపై చర్చించేందుకు వెళ్లారా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..