Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో అర్థరాత్రి వరకూ పోలింగ్.. ఎంత నమోదైందో ఈసీ అంచనా..

AP News: ఏపీలో అర్థరాత్రి వరకూ పోలింగ్.. ఎంత నమోదైందో ఈసీ అంచనా..

Srikar T

|

Updated on: May 14, 2024 | 2:21 PM

ఏపీలో అర్థరాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగినట్లు ఎస్ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైందని ఈసారి దానికంటే పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. విజయవాడ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.

ఏపీలో అర్థరాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగినట్లు ఎస్ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైందని ఈసారి దానికంటే పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. విజయవాడ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్‎తో కలిపి మొత్తం 79.8 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మే 13న జరిగిన ఎన్నికల్లో అర్థరాత్రి 12 గంటల వరకూ 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేశారు. వీటికి 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కలిపితే 79.4 శాతం నమోదవుతుందని వివరించారు.

రాత్రి 12 తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా కొత్త EVM లు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 20 కేంద్రాల్లో కొత్త EVM లకు మాక్ పోలింగ్ నిర్వహించి ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పూర్తి వివరాలు, నమోదైన పోలింగ్ శాతం కూడా వస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ సరళిని బట్టి 81శాతం వరకు నమోదై ఉండవచ్చని తాము అంచనావేస్తున్నట్లు తెలిపారు. సరైన గణాంకాలు ఈరోజు సాయంత్రానికి తెలుస్తుందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 14, 2024 02:19 PM