AP Elections 2024: ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు.. టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య బాహాబాహి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

AP Elections 2024: ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు.. టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య బాహాబాహి
Ap Election Violence
Follow us
Janardhan Veluru

|

Updated on: May 13, 2024 | 3:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే పలు చోట్ల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

  1. ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు, దాడులు జరిగాయి. నెల్లూరు జిల్లా దగదర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం దాడికి దిగాయి ఇరు వర్గాలు.
  2. కడప జిల్లా జమ్మలమడుగులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, కూటమి కార్యకర్తలు ఎదురుపడటంతో మాటా, మాటా పెరిగి ఇరువర్గాలు దాడికి యత్నించాయి. రెండువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
  3. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్‌ నెలకుంది. కమాన్‌ సర్కిల్‌లో వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. పరస్పరం రాళ్ల దాడితో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. జిల్లా ఎల్పీ వాహనం కూడా రాళ్ల దాడిలో ధ్వంసమయ్యింది.
  4. అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహించారు టీడీపీ నేతలు. ఇది పద్దతి కాదని అడ్డుకున్నారు వైసీపీ నేతలు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
  5. ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలో ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. తారక రామానగర్ యుపి స్కూల్ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైసీపీ ఏజెంట్లు ఘర్షణ పడ్డారు. ఈ గొడవతో ఓటర్లు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
  6.  ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కాసేపు పోలింగ్ నిలిపివేశారు అధికారులు.
  7. పల్నాడు జిల్లా పెదకూరపాడులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. అచ్చంపేట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కర్రలతో దాడులకు దిగారు ఇరుపార్టీల కార్యకర్తలు.
  8. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో ఓటర్లను తీసుకు వెళ్లే విషయంలో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత నెల్లూరి రామకోటయ్యతో పాటు…మరికొందరికి గాయాలయ్యాయి. అటు రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ పోలింగ్ ఏజంట్లపై వైసీపీ నేతలు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
  9. గుంటూరు జిల్లా తెనాలి పోలింగ్ కేంద్రంలో క్యూలో రమ్మన్నందుకు ఓటర్ పై చేయి చేసుకున్నాడు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్. తిరిగి ఓటర్ కూడా ఎమ్మెల్యే పై చేయి చేసుకున్నాడు. దీంతో శివకుమార్‌ అనుచరులు ఓటర్ పై మూకుమ్మడిగా దాడికి దిగారు.

ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తత