PM Modi in Varanasi: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్‌ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా.. వారణాసిలో నామినేషన్‌కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేశారు.

PM Modi in Varanasi: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్..
Pm Modi
Follow us

|

Updated on: May 14, 2024 | 12:56 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్‌ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా.. వారణాసిలో నామినేషన్‌కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేశారు. అనంతరం హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్‌ నుంచి నమోఘాట్‌కు చేరుకుని మోదీ పూజలు చేశారు. అక్కడినుంచి కాలభైరవ ఆలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అనంతరం మోదీ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని వరుసగా మూడోసారి వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.

ప్రధాని మోదీ తొలుత 2014, ఆ తర్వాత 2019లో భారీ మెజార్టీ గెలుపొందారు.. మళ్లీ 2024లో వారణాసి నుంచి హ్యాట్రిక్‌ కొట్టి, మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ ధీమాగా ఉన్నారు. హ్యాట్రిక్‌పై గురిపెట్టిన ప్రధాని మోదీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014లో 3 లక్షల 37 వేల ఓట్లతో గెలిచారు ప్రధాని మోదీ. 2019లో అంతకు మించిన మెజారిటీ వచ్చింది. 4 లక్షల 80 వేల ఓట్ల తేడాతో ప్రధాని మోదీ గెలుపొందారు. ఈ సారి మెజారిటీపై అంతకు మించిన అంచనాలున్నాయి.

ప్రదాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలువురు నాయకులు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్