AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dual Flush Toilets: టాయిలెట్స్‌లో ఫ్లష్‌ బటన్లు రెండు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ రీజన్ ఇదే

దాదాపు ప్రతి ఇంట్లో టాయిలెట్స్‌ ఉంటాయి. అలాగే బయటికి వెళ్లినప్పుడు కూడా ప్రతి షాపింగ్‌ మాల్స్‌, ఆఫీస్‌, బస్టాండ్‌.. ఇలా ప్రతిచోట టాయిలెట్స్‌ కనిపిస్తాయి. ఒకప్పుడు ఇంతటి విస్తృతంగా మరుగుదొడ్డు అందుబాటులో ఉండేవి కావు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల అవసరాలను అనుగుణంగా సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే వాడే వెస్ట్రన్ టాయిలెట్లు కూడా మన దేశంలో..

Dual Flush Toilets: టాయిలెట్స్‌లో ఫ్లష్‌ బటన్లు రెండు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ రీజన్ ఇదే
Double Flush Toilets
Srilakshmi C
|

Updated on: May 14, 2024 | 10:59 AM

Share

దాదాపు ప్రతి ఇంట్లో టాయిలెట్స్‌ ఉంటాయి. అలాగే బయటికి వెళ్లినప్పుడు కూడా ప్రతి షాపింగ్‌ మాల్స్‌, ఆఫీస్‌, బస్టాండ్‌.. ఇలా ప్రతిచోట టాయిలెట్స్‌ కనిపిస్తాయి. ఒకప్పుడు ఇంతటి విస్తృతంగా మరుగుదొడ్డు అందుబాటులో ఉండేవి కావు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల అవసరాలను అనుగుణంగా సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే వాడే వెస్ట్రన్ టాయిలెట్లు కూడా మన దేశంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దాదాపు ప్రతిచోట వెస్ట్రన్ టాయిలెట్లు కనిపిస్తున్నాయి. అయితే మీరెప్పుడైనా గమనించారా? వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఫ్లష్‌కు రెండు బటన్‌లు ఉండటాయి. ఈ బటన్‌లలో కూడా ఒకటి పెద్దగా, మరొకటి చిన్నగా ఉంటుంది. అసలు ఇలా ఫ్లష్‌కు రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లష్‌కు రెండు బటన్‌లు ఉండటం వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే.. మొదట్లో టాయిలెట్‌ ఫ్లష్‌ను డిజైన్​చేసినప్పుడు దానికి ఒకే బటన్‌ ఉండేదట. ఈ బటన్‌ను ప్రెస్​చేయడం వల్ల ఎక్కువగా నీరు వృథాగా పోయేది. అయితే అమెరికాకు చెందిన ప్రముఖ ఇండస్ర్టియల్‌ డిజైనర్‌ విక్టర్‌ పాపనెక్‌ 1976లో రాసిన తన ‘డిజైన్ ఫర్ ది రియల్ వరల్డ్’ పుస్తకంలో తొలిసారి డ్యూయల్-ఫ్లష్ టాయిలెట్ గురించి ప్రస్తావించారు. 1980లో నీటి వృథాను అరికట్టేందుకు ఆస్ట్రేలియాలోని కరోమా ఇండస్ట్రీస్‌లోని ఇంజనీర్లు మొట్టమొదటి సారిగా డ్యూయల్-ఫ్లష్ టాయిలెట్ డిజైన్‌ను అభివృద్ధి చేశారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి కరువు ఉండేది. అందువల్ల నీటిని ఆదా చేయడానికి ఈ డ్యూయల్‌ ఫ్లష్‌ టాయిలెట్‌ ఎంతో ఉపయోగపడింది. ఆ తర్వాత 1992లో అమెరికాలో ఈ డ్యూయల్-ఫ్లష్ టాయిలెట్‌ వినియోగంలోకి వచ్చింది.

అయితే పెద్ద బటన్‌కు, చిన్న బటన్‌లు ఎందుకు ఉంటాయంటే.. తొలుత డబుల్‌ ఫ్లష్‌ కనిపెట్టినప్పుడు పెద్ద బటన్‌ను ఒకసారి ఫ్లష్‌ చేస్తే 11 లీటర్ల నీరు బయటకు వచ్చేదట. ఇక చిన్న బటన్‌ను ఫ్లష్‌ చేసినప్పుడు 5.5 లీటర్ల నీరు బయటకు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఇలా కూడా నీరు ఎక్కువగా వేస్ట్​అవుతుండటంతో దీని డిజైన్‌లో మరికొన్ని మార్పులు చేశారు. కొత్తగా డిజైన్‌ చేసిన డ్యూయల్‌ ఫ్లష్‌లో పెద్ద బటన్‌ను ఫ్లష్‌ చేస్తే 6-7 లీటర్‌ల నీరు, అదే చిన్న బటన్‌ను ఫ్లష్‌ చేస్తే 3-4 లీటర్‌ల నీరు బయటకు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఈ రెండు బటన్లు ఎలా వాడాలంటే.. మలవిసర్జన చేసినప్పుడు పెద్ద బటన్‌ను ప్రెస్‌ చేయాలి. మూత్ర విసర్జనకు చిన్న బటన్‌ను ఫ్లష్‌ చేస్తే సరిపోతుంది. ఫలితంగా నీరు కూడా ఆదా అవుతుంది. ఇలా రెండు ఫ్లష్‌లను వాడటం వల్ల ఓ వ్యక్తి ఏడాదికి దాదాపు 20వేల లీటర్ల నీటిని పొదుపు చేయగలడట.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.