26 December 2024
Pic credit -Social Media
TV9 Telugu
ఆనపకాయ లేదా సొర కాయను తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆస్థమా, దగ్గు, , బ్రాంకైటిస్వంటి వ్యాధులతో బాధపడే వారికీ ఇది ఒక ఔషధంలా పని చేస్తుంది.
సొర కాయలో విటమిన్ బి, ఎ, సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
సొర కాయలో పుష్కలంగా ఫైబర్ , నీరు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
సొర కాయలో లో తక్కువ కేలరీలు ఉంటాయి. దీని వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కడుపులో ఏదైనా సమస్య ఉంటే సొరకాయను క్యాబేజీని కలిపి తినొద్దు.. ఇలా ఈ రెండిటిని కలిపి తింటే గ్యాస్ సమస్య వస్తుంది.
సొరకాయతో బ్రోకలీని కలిపి తినే తల తిరగడం, వాంతులు, ముక్కు కారడం వంటి అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
సోరకాయను, బీట్‌రూట్ కలిపి పొరపాటున కూడా తినవద్దు. ఎందుకంటే ఈ రెండిటిని కలిపి తినడం వలన శరీరంపై దద్దుర్లు వస్తాయి.
సొరకాయని పుల్లగా ఉండే నిమ్మ, నారింజ పండ్లతో పాటు పుల్లటి ఆహారాలు కలిపి తినవద్దు. ఇలా తింటే కడుపు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయి.