ఈ మధ్యకాలంలో వృద్ధుల్లోనే కాదు యువతలోనూ కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతోంది. పోషకాల అసమతుల్యత, డైట్‌లో లోపాలు.. ఇలా ఈ సమస్య పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయి.
వీరు వీలైనంత ఎక్కువ నీరు తాగాలని.. అలాగే నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు
ఇదే సమయంలో కొందరు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు బీరు ఎక్కువగా తాగితే మంచిదని అంటుంటారు.
అసలు బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా.? లేదో.? అసలు ఇందులో నిజమెంత అనేది తెలుసుకుందామా..
కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారికి బీర్ తాగమని వైద్యులు ఎప్పుడూ సలహా ఇవ్వరు. బీర్ తాగడం వల్ల మూత్రంలో రాళ్లను నయం చేయవచ్చనేది కేవలం అపోహ మాత్రమే.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు బీరు లాంటి ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
బీర్ తాగడం వల్ల పదేపదే మూత్ర విసర్జన చేసే సమస్య వస్తుంది.. తప్పితే.. కిడ్నీలో రాళ్లు మాత్రం కరిగిపోవు.
ఒక వ్యక్తికి కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే, వారు బీర్ తాగడం వల్ల మూత్రం వేగంగా ఉత్పత్తి అవుతుంది. కిడ్నీ వాపు వస్తుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.