ఆరోగ్యకరమైన చర్మం కలిగి ఉండాలని కోరుకునేవారు ప్రతిరోజు పెరుగుతో ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎంతో కాంతివంతంగా, అందం కనిపిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
TV9 Telugu
శరీర ఆరోగ్యంతో పాటు ముఖ సౌందర్యాన్ని పెంచడంలో పెరుగు ఎంతో మేలు చేస్తుందని చర్మ వైద్యులు చెబుతున్నారు. పెరుగు చేసే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు మ్యాజిక్‌లాంటి మెరుపుని చూస్తారు.
TV9 Telugu
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. మొండి నల్లటి మచ్చలను తొలగిస్తుంది. అలాగే తలలో ఉన్న చుండ్రును కూడా పెరుగు తొలగిస్తుంది.
TV9 Telugu
పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ లు అత్యధిక స్థాయిలో లభిస్తాయి. అంతే కాకుండా, విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
TV9 Telugu
పెరుగులో ఉండే యాంటి మైక్రోబియాల్ ప్రాపర్టీస్ చర్మ సమస్యలకు రెమిడీగా పని చేస్తాయి. పెరుగులో ఉండే పోషకాలు, యాంటీ ఇన్ ప్లామేషన్ గుణాలు చర్మాన్ని మరింత అందంగా చేస్తాయి.
TV9 Telugu
పెరుగుని మీ ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిమిషాల పాటు ఇలా చేయటం వల్ల చర్మంపైనున్న మృతకణాలు తొలగిపోతాయి. రక్తప్రసరణ సరిగా ఉంటుంది.
TV9 Telugu
చర్మంలో తేమను పెంపొందించేందుకు, చర్మాన్ని పొడిబారనీయకుండా చేసేందుకు పెరుగు తోడ్పడుతుంది. చర్మంలోని ఎలాస్టిసిటీని సంరక్షించేందుకు కూడా పెరుగు తోడ్పడుతుంది.
TV9 Telugu
తురిమిన దోసకాయ గుజ్జుతో పెరుగు కలిపి ఫేస్‌ప్యాక్ తయారు చేసి వాడుకొవచ్చు. తరచూ ఇలా చేస్తూ ఉంటే, ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు, నలుపుదనం తగ్గిపోతుంది.