మగవారి కంటే మహిళలే ఎక్కువ స్ట్రెస్ ఫీలవుతున్నారు..! తాజా సర్వేలో షాకింగ్ విషయాలు..
వ్యక్తిగతంగా జాబ్ పరంగా మహిళలు పురుషులు ఎలాంటి మెంటల్ సిచువేషన్ ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి దాదాపు 5000 మందిని నిపుణులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీరు దాదాపు 72.2శాతం మహిళలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించారు. పురుషులలో 53 పాయింట్ 64శాతం ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారని రిపోర్ట్ లో తేలింది. అయితే ఈ ఒత్తిడికి కారణాలను విశ్లేషిస్తే...
నేటి ఆధునిక కాలంలో సమయంతో పాటు పరిగెడుతున్న జీవితాలు మనవి. ఎప్పుడూ ఉరుకులు పరుగుల జీవితాలే. కాస్త టైమ్ దొరికితే రిలాక్స్ అవ్వడానికి చూస్తాం. కానీ టైమే ఉండదు. దీనికి తోడు పని ఒత్తిడి…అందుకే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవ్వడం మనందరికీ కామన్ అయిపోయింది.దీంతో మానసిక ప్రశాంతత అనేది లేకుండా పోతుంది..స్ట్రెస్ కారణంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య తలెత్తుతున్నాయి. తాజాగా జరిపిన సర్వేలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనం తెలిపింది.
కుటుంబ బాధ్యతలు జాబ్ కు సంబంధించిన సవాళ్ల మధ్య పురుషులు అధిక ఒత్తిడి ఎదుర్కొంటారని అందరూ అనుకుంటారు. కానీ రియాల్టీలో మాత్రం మహిళలే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారని ఎమోషనల్ వెల్నెస్ పేరుతో చేసిన ఒక సర్వేలో వెళ్లడైంది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో మహిళలు మగవారి కంటే ఎక్కువగా స్ట్రెస్ ని ఎదుర్కొంటారని ఆ సర్వే చేసిన నిపుణులు తెలిపారు.
వ్యక్తిగతంగా జాబ్ పరంగా మహిళలు పురుషులు ఎలాంటి మెంటల్ సిచువేషన్ ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి దాదాపు 5000 మందిని నిపుణులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీరు దాదాపు 72.2శాతం మహిళలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించారు. పురుషులలో 53 పాయింట్ 64శాతం ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారని రిపోర్ట్ లో తేలింది. అయితే ఈ ఒత్తిడికి కారణాలను విశ్లేషిస్తే ఉద్యోగం చేస్తున్న స్త్రీ పురుషులను పోల్చినప్పుడు పురుషులు కేవలం ఉద్యోగపరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటి పనులు కుటుంబ బాధ్యతల విషయంలో తక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ, మహిళలు మాత్రం ఓవైపు ఇంటి పనులు కుటుంబ బాధ్యతల తో పాటు వృత్తిపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎక్కువగా సఫర్ అవుతున్నారని సర్వేను విశ్లేషించిన నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు పనికి తగిన గుర్తింపు లేకపోవడం వర్క్ ప్లేస్ లో అభద్రతా భావం వంటివి కూడా 20 శాతం మంది మహిళల్లో మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయని నిపుణులు తెలిపారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.