Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త సంవత్సరం వేళ.. ప్రజలకు షాకింగ్ న్యూస్.. వేగంగా వ్యాప్తిస్తోన్న ప్రాణాంతక వైరస్..

2024కి వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలకడానికి యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకుంటున్న ప్రజలకు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది . కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కనుగొనబడింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల్లో ఈ వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 400 మందికి ఈ వ్యాధి సోకిందని, 30 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

కొత్త సంవత్సరం వేళ.. ప్రజలకు షాకింగ్ న్యూస్.. వేగంగా వ్యాప్తిస్తోన్న ప్రాణాంతక వైరస్..
Mysterious Disease
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 26, 2024 | 2:58 PM

కరోనా మహమ్మారి తర్వాత, ప్రపంచంలో అనేక తీవ్రమైన వైరస్‌లు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు మరో విచిత్రమైన వైరస్‌ బయటపడింది. కరోనా వైరస్ ఇప్పటికీ చాలా మందిని భయపెడుతోంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నరకం అనుభవించారు. వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో చాలా మంది కడుపుకు తిండి కూడా ఇబ్బందులుపడ్డారు. ధనవంతులు, పేదవారు అనే తేడా లేకుండా అందరూ కరోనా కారణంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ, ఆ భయంకరమైన రోజులు మళ్లీ రాకూడదని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు.

2024కి వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలకడానికి యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకుంటున్న ప్రజలకు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది . కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కనుగొనబడింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల్లో ఈ వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అవును.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ‘డింగా డింగా’ అనే వైరస్‌ బయటపడింది. ఇప్పటికే దాదాపు 300 మందికి ఈ వింత వ్యాధి సోకిన్నట్టుగా సమాచారం.

స్థానికంగా ఈ వ్యాధికి ‘డింగా డింగా’ అని పేరు పెట్టారు. ఈ పేరు ఫన్నీగా అనిపించినప్పటికీ, ఇది చాలా ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.. ఈ ప్రాణాంతక వైరస్ ఎక్కువగా మహిళలు, టీనేజ్ అమ్మాయిలలో కనిపిస్తుంది. ఈ వ్యాధిపై ఐక్యరాజ్యసమితి స్వయంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వైరస్ గురించి యావత్ ప్రపంచానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లే.

ఇవి కూడా చదవండి

ఈ అంటు వ్యాధి మనుషుల ద్వారా సంక్రమిస్తుందా లేక జంతువులు, పక్షుల ద్వారా వ్యాపిస్తుందా అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ వ్యాధికి మందు కనుగొనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఉగాండాలో ఈ వైరస్ కరోనా మాదిరిగా విస్తరిస్తోంది. శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని డిసీజ్ ఎక్స్ అని పిలుస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారికి యాంటీ బయోటిక్స్ ఇస్తారు. రానున్న రోజుల్లో ఈ వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

ఈ వైరస్ సోకిన వారిలో ముందుగా జ్వరం వస్తుంది. శరీరమంతా వణికిపోతోంది. వ్యాధి సోకిన ఉగాండా మహిళలు డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా కరోనా వంటి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని నిపుణులు సూచించారు. ఇది అంటువ్యాధి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

కాంగోలో మరో వ్యాధి నిర్ధారణ!

ఉగాండాలో డింగా డింగా వైరస్‌ ప్రారంభం కాగా, ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో మరో రకమైన వ్యాధి వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఇది ఎవరికీ అర్థం కాని వైరస్. ఇప్పటికే 400 మందికి ఈ వ్యాధి సోకిందని, 30 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారడం, గొంతునొప్పి వంటి సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.