Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ట్రెండ్ మారింది గురూ..! ఎలక్ట్రిక్‌ బైక్‌పై వరుడు వెరైటీ ఎంట్రీ.. వధువు ఇంట చిందులే..!

ఈ ఫోటో వైరల్ కావడంతో వరుడు కూడా స్పందించాడు. ‘నా పెళ్లి బరాత్ కోసం రిజ్టా వచ్చింది’ అని పోస్టు పెట్టాడు. కాగా, సోషల్ మీడియాలో ఫోటో వైరల్‌గా మారడంతో ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. @peakbengaluru 'పెళ్లిలో గుర్రాలకు బదులు ఏథర్ స్కూటర్లు వాడుతున్నారని అంటున్నారు. ఎథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ వాహనం గత నెలలో విడుదలైంది. దీని ధర రూ..

Watch Video: ట్రెండ్ మారింది గురూ..! ఎలక్ట్రిక్‌ బైక్‌పై వరుడు వెరైటీ ఎంట్రీ.. వధువు ఇంట చిందులే..!
Bengaluru Groom
Follow us
Jyothi Gadda

|

Updated on: May 15, 2024 | 4:09 PM

వివాహాలు ఎన్నో సంప్రదాయాలు, పద్ధతులు పాటిస్తూ జరుగుతుంటాయి. కానీ, నేటి యువత పెళ్లికి సంబంధించి ప్రతి విషయంలోనూ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. పెళ్లి అనేది తమ జీవితంలో జరిగే అపూర్వఘట్టం. కాబట్టి ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇందుకోసం కొత్త కొత్త టెక్నిక్స్‌ని అవలంబిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటిదే పెళ్లికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. బెంగుళూరులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడు గుర్రాన్ని వదిలి ఏథర్ ఎలక్ట్రిక్ బైక్‌పై తన పెళ్లికి వచ్చాడు. పెళ్లి కుమార్తె ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు వరుడు సైతం డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వరుడు బెంగళూరుకు చెందిన దర్శన్ పటేల్.. ఇతను ఏథర్ ఎనర్జీతో పనిచేస్తున్న పారిశ్రామిక డిజైనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతవారమే ఆయనకు పెళ్లి అయింది. పెళ్లి బరాత్‌ సందర్భంగా అతడు ఏథర్‌ ఎలక్ట్రిక్ బైక్‌పై వధువు ఇంటికి చేరుకున్నాడు. ఏథర్‌ ఎలక్ట్రిక్‌ వాహనం ఇటివలే మార్కెట్‌లోకి విడుదల చేశారు. అయితే దర్శన్ పటేల్‌ తమ కంపెనీకి చెందిన ఏథర్‌ ఎలక్ట్రిక్ బైక్‌పై వివాహానికి వెళ్లడం పట్ల ఏథర్‌ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహాత సైతం స్పందించారు. తన వివాహానికి రిజట మీద వెళ్లాలనుకుంటున్నట్లు తమతో దర్శన్ ముందుగానే చెప్పాడని అన్నారు. అందుకు తమ సంస్థ సంతోషం వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, దీనిపై పీక్ బెంగళూరు అనే స్టార్టప్ కంపెనీ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పెళ్లిలో గుర్రాల స్థానంలో ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్నారు’ అని పోస్టు చేసింది. ఈ వైరల్ ఫోటోలో ఉన్న ఈవీ కొత్తగా లాంచ్ అయిన ఏథర్ రిజ్టా ఈవీ బైక్. ఈ ఫోటో వైరల్ కావడంతో వరుడు కూడా స్పందించాడు. ‘నా పెళ్లి బరాత్ కోసం రిజ్టా వచ్చింది’ అని పోస్టు పెట్టాడు. కాగా, సోషల్ మీడియాలో ఫోటో వైరల్‌గా మారడంతో ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. @peakbengaluru ‘పెళ్లిలో గుర్రాలకు బదులు ఏథర్ స్కూటర్లు వాడుతున్నారని అంటున్నారు.

ఎథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ వాహనం గత నెలలో విడుదలైంది. దీని ధర రూ.1.10 లక్షలు. 999 నుండి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. జూలై నుండి ఈ టూవీలర్‌ డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..