ఎలాంటి రసాయనాలు వాడని అరటి పండ్లు.. పూర్వకాలంలో ఇలాగే మగ్గబెట్టేవారట..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

గోతిపై అరటి, కొబ్బరి ఆకులు కప్పి దాన్ని తిరిగి మట్టి కప్పేసి పూడ్చేసింది. రెండు రోజుల తర్వాత తిరిగి గోతిని తవ్వి చూడగా ఆశ్చర్యకరంగా పచ్చి అరటిగెల కాస్తా పసుపుపచ్చ రంగులోకి మారిపోయింది. దీంతో ఆ గెలను పైకి తీసి శుభ్రపరిచిన ఆ పెద్దావిడ ఓ పండును తెప్పి రుచి చూసింది. తియ్యగా ఉందని తెలిశాక దాన్ని విక్రయించేందుకు మార్కెట్ కు తరలించింది.

ఎలాంటి రసాయనాలు వాడని అరటి పండ్లు.. పూర్వకాలంలో ఇలాగే మగ్గబెట్టేవారట..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Bananas
Follow us

|

Updated on: May 14, 2024 | 10:08 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పెద్దావిడ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆన్‌లైన్‌ వేదికగా వీడియో తీవ్ర చర్చకు దారి తీసింది. అరటిపండ్లను ఎలాంటి రసాయనాలు లేకుండా, సహజ పద్ధతిలో మగ్గబెట్టిన విధానం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ వీడియోను ఈశ్వరి ఎస్ అనే ఆవిడ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కంట్రీ ఫుడ్ కుకింగ్ వీడియో ద్వారా షేర్ చేసింది. ‘మా ఊరిలో నానమ్మ సంప్రదాయ పంటలు పండిస్తోంది’ అనే ట్యాగ్‌లైన్‌తో వీడియోలను షేర్ చేశారు. నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన అరటి పండ్లు మక్కబెట్టిన విధానానికి సంబంధంచిన వీడియో ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రసాయనాలు లేకుండా అరటిపండ్లను పండించే సాంప్రదాయ పద్ధతి సోషల్ మీడియా వినియోగదారులను బాగా ఆకర్షించింది.

అరటి పండ్లను ఈజీగా మక్కబెట్టేందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో దక్షిణ భారతదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన పెద్దావిడ అరటి తోటలోంచి ఓ పెద్ద పచ్చి అరటి గెలను తెంపుతుంది. ఆ తర్వాత దాన్ని ఓ గొయ్యి తీసి అందులో పెడుతుంది. ఓ చిన్న గిన్నెలో పిడకలకు నిప్పు అంటించి గెల పక్కనే ఉంచింది. ఆ తర్వాత ఆ గెలను అరటి ఆకులతో కప్పేసింది. అలాగే గోతిపై అరటి, కొబ్బరి ఆకులు కప్పి దాన్ని తిరిగి మట్టి కప్పేసి పూడ్చేసింది. రెండు రోజుల తర్వాత తిరిగి గోతిని తవ్వి చూడగా ఆశ్చర్యకరంగా పచ్చి అరటిగెల కాస్తా పసుపుపచ్చ రంగులోకి మారిపోయింది. దీంతో ఆ గెలను పైకి తీసి శుభ్రపరిచిన ఆ పెద్దావిడ ఓ పండును తెప్పి రుచి చూసింది. తియ్యగా ఉందని తెలిశాక దాన్ని విక్రయించేందుకు మార్కెట్ కు తరలించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోని చూసిన నెటిజన్లు పండ్లు మగ్గేంత వరకు చెట్టుకే ఎందుకు ఉంచరు అని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రసాయనాలకు బదులుగా పూర్వకాలంలో ఉపయోగించిన ఈ టెక్నిక్‌ అద్భుతంగా ఉంది. ఎలాంటి దుష్పభావాలు లేని ఆరోగ్యకరమైన టెక్నిక్‌ అంటూ వృద్ధురాలు చేసిన పనిని తెగ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్