Watch Video: ఓరీ దేవుడో.. డీజిల్‌తో పరాఠా తయారీ.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

ఇలాంటి పరాటాలు తింటే క్యాన్సర్‌ రావడం ఖాయమని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇలాంటివి దారుణమని.. ఇలా చేసే వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేశారు. అయితే, అది డీజిల్, పెట్రోల్ కాదని, ఇప్పటికే వాడిన నూనె అంటున్నారు మరికొందరు నెటిజన్లు.

Watch Video: ఓరీ దేవుడో.. డీజిల్‌తో పరాఠా తయారీ.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!
Diesel Paratha
Follow us
Jyothi Gadda

|

Updated on: May 14, 2024 | 10:03 PM

సాధారణంగా చపాతీ, పరాటాలు అంంటే అందరూ ఇష్టంగా తింటారు. చాలా మంది మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌, నైట్‌ డిన్నర్లో రోటీ, చపాతీలనే తింటూ ఉంటారు. మరికొందరు మధ్యాహ్న భోజనంలో పరాటాలను తింటుంటారు. ఈ పరాటాలను కాల్చేందుకు బట్టర్‌, నెయ్యి, నూనెతో కాల్చి చేస్తుంటారు. పరాటాల్లో ముఖ్యంగా ఆలు పరాటాను అందరూ ఇష్టంగా తింటుంటారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి చేసిన డీజిల్ పరాటా నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. బాబోయ్‌ ఇదేం పరాటా సామీ అంటూ పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీడియోలో.. ముందుగా ఒక దాబాలో పనిచేస్తున్న వంట మాస్టర్‌ మొదట పిండిని తడిపి రోటీ తయారు చేశాడు.. అందులోనే ఉడకబెట్టిన ఆలూ మిక్స్‌ని వేశాడు. ఆ తర్వాత మెల్లగా ఒత్తుతూ ఆలూ పరాటా తయారు చేశాడు. దాన్ని పెనంపై వేసి రెండు వైపులా కాస్త కాల్చాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. ఇక చివరగా కాలుతున్న పరాటాపై నూనె లేదంటే..నెయ్యికి బదులుగా డీజిల్‌ని పోశాడు. డీజిల్ మిక్స్ అని చెబుతూ పరాటాను మొత్తం డీజిల్‌లోనే ముంచేశాడు. అందులోనే ఆ పరాటాను బాగా కాల్చాడు. వామ్మో.. వాహనాల్లో వాడే డీజిల్‌తో పరాఠాను తయారు చేసే వీడియో చూసిన వినియోగదారులు షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

నెబ్యులా వరల్డ్ అనే ‘ఎక్స్’ అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఈ భయంకరమైన వీడియోకు ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన పలువురు భిన్నంగా స్పందించారు. ఇలాంటి పరాటాలు తింటే క్యాన్సర్‌ రావడం ఖాయమని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇలాంటివి దారుణమని.. ఇలా చేసే వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేశారు. అయితే, అది డీజిల్, పెట్రోల్ కాదని, ఇప్పటికే వాడిన నూనె అంటున్నారు మరికొందరు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..