వామ్మో.. ఇదేం చూపురా నాయనా.. నెటిజన్లు బెంబేలు.. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు

వామ్మో.. ఇదేం చూపురా నాయనా.. నెటిజన్లు బెంబేలు.. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు

Phani CH

|

Updated on: May 14, 2024 | 6:47 PM

బెంగళూరులోని ఓ కూరగాయల దుకాణం ముందు వేలాడదీసిన ఓ మహిళ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. కళ్లుపెద్దవి చేసుకుని కోపంగా చూస్తున్న ఆమె ఫొటోను చూసిన వారంతా వామ్మో ఏం చూపురా నాయనా అంటూ దెబ్బకు జడుసుకుంటున్నారు! ఇందుకు కారణం ఏమిటని ఆరా తీస్తూ రకరకాల కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. నిహారిక అనే ‘ఎక్స్’ యూజర్ షేర్ చేసిన కాసేపటికే ఈ ఫొటో నెట్టింట హల్ చల్ చేసింది. షేర్ చేసిన రెండు రోజులకే ఈ ఫొటోకు దాదాపు 95 వేల వ్యూస్ లభించాయి.

బెంగళూరులోని ఓ కూరగాయల దుకాణం ముందు వేలాడదీసిన ఓ మహిళ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. కళ్లుపెద్దవి చేసుకుని కోపంగా చూస్తున్న ఆమె ఫొటోను చూసిన వారంతా వామ్మో ఏం చూపురా నాయనా అంటూ దెబ్బకు జడుసుకుంటున్నారు! ఇందుకు కారణం ఏమిటని ఆరా తీస్తూ రకరకాల కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. నిహారిక అనే ‘ఎక్స్’ యూజర్ షేర్ చేసిన కాసేపటికే ఈ ఫొటో నెట్టింట హల్ చల్ చేసింది. షేర్ చేసిన రెండు రోజులకే ఈ ఫొటోకు దాదాపు 95 వేల వ్యూస్ లభించాయి. బెంగళూరులోని కాత్రిగుప్పె వాటర్ ట్యాంక్ సమీపంలోని షాప్ వద్ద ఈ ఫొటో ఏర్పాటు చేసినట్లు కొందరు నెటిజన్లు గుర్తించారు. దీని వెనక పెద్ద స్టోరీ ఏమీ లేదని.. దుకాణానికి చెడు దృష్టి తగలకుండా ఉండేందుకే ఈ ఫొటో ఏర్పాటు చేశారని అసలు విషయం తెలిసిన వారు చెప్పుకొచ్చారు. దీనిపై చాలా మంది యూజర్లు సరదా కామెంట్లు పోస్ట్ చేశారు. బేరాలు ఆడకుండా నోర్మూసుకొని కూరగాయలు కొనుక్కు వెళ్లండి అన్నట్లుగా ఆమె చూపు ఉందని ఓ యూజర్ కామెంట్‌ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ ముఖం చందమామలా వెలిగిపోవాలంటే ఇలా చేయండి !!

Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చక్కటి ఫుడ్స్ ఇవే..

Allu Aravind: రామాయణ మేకర్స్‌కు నోటీసులిచ్చిన అల్లు అరవింద్

Kannappa: ఏంటీ ?? కన్నప్పలో ప్రభాస్‌ శివుడు కాదా ?? బిగ్ ఝలక్ ఇచ్చిన మంచు బాబు

Katrina Kaif: ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? అంటే..! ఆమె ఆన్సర్ ఇది